Others

బుద్ధి ప్రచోదనంతోనే సాత్వికమార్గం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పరమాత్మను పొందాలనుకొనేవారు, పురుష ప్రయత్నము సాగించువారు రెండువిధాలు. శాస్తమ్రును అనుసరించువారు, శాస్తమ్రును అతిక్రమించువారు, శాస్తమ్రు శాస్ర్తీతముగా ఉంటే పరమార్థమును ముందుంచును. ‘వాసనలు’ ‘శుద్ధ’ మనియు ‘అశుద్ధ’మనియు రెండు విధములు. శుద్ధ వాసనలు, శుద్ధతత్వమునకు దారితీసి భగవంతుని తత్వాన్ని గ్రహించుతాడు. అశుద్ధవాసనలు తామస, రాజసిక తత్వములను ప్రకోపింప చేసి నరకానికి గొనిపోతాయి. పురుష ప్రయత్నము చేత మనసును శుభమార్గమునందే కలుపవలయును. ‘షడ్భాగంచ మనుష్యాణాం సప్తమం దైవచింతనమ్’ అంటారు. సత్పురుషులను కలవటం, పెద్దలను గౌరవించటం, దైవారాధన్ మనసు లగ్నము చేయుట, ద్రవ్యము ఉంటే యజ్ఞయాగాదులు చేయుట లేదా చూచుట, పుణ్యక్షేత్ర సందర్శనము,అతి తక్కువగా మాట్లాడుట ఇట్లాంటి లక్షణాలను అలవాటు చేసుకొనవలెను. దురాచారులకు, దుష్టులకు, డాంభికులకు దూరంగా ఉండాలి. సంకల్ప ప్రవాహదిశను శుభమార్గం వైపుకు త్రిప్పవలెను. ఎంత ప్రయత్నము చేసినా బ్రహ్మసూత్ర భాష్యములో చెప్పినట్టు మనం ఉద్ధరించ బడాలంటే భగవంతుడు మనతో మంచి పనులు చేయిస్తాడు. కఠోపనిషత్తులో చెప్పినట్లు ‘ఆత్మానం రధినం విద్ధి, శరీరం రథమేవతు, బుద్ధింతు సారధిం విదిధ, మనః ప్రగ్రహమేవచ’’ ఆత్మ రథికుడు , బుద్ధి సారథి, మనసు కళ్లెం ఇంద్రియాలు గుర్రాలు, విషయవస్తువులు -బాట.
మనం ప్రపంచం నుండి బయటపడుటసాధ్యం కాదు. విషయ వస్తువులతోనే జీవించాలి. సారథి సమర్థుడు కాకపోతే (అంటే బుద్ధి వికసించకపోతే) అనగా నిద్రపోతే , జడమైతే మనసుచెలరేగి పోతుంది. అడ్డు అదుపు లేకుండా పలుదిశలలో వెళ్తుంది. ఇంద్రాయాలు ఒకటొకటి వాటి ఇష్టమైన త్రోవలో అవి పరుగులు తీస్తుంటాయి. చివరకు రథికుని మరణానికి దారితీస్తుంది. బుద్ధి నూటికి తొంభై తొమ్మిది మందిలో మొగ్గగానే ఉండి వికసించదు. పర్యవసానము మనసు దాని ఇష్టం వచ్చినట్లు అది ఆడుతుంది.
ఈ బుద్ధి జాగృతము చేయబడు క్రియ మూడు స్థితుల్లో పనిచేస్తుంది.
1. అంతఃప్రేరణ: మనిషిలో సుప్త చేతనలో వచ్చే మనోవైఖరులు,. ఇది మన చేతిలో ఉండదు. పుడుతూనే వచ్చినది. పుడకలలో పెట్టినట్లు, ఎన్నో జన్మల సంస్కారాలు ప్రతిఫలిస్తాయి. దీనిని నమ్మలేము.
2. తెలివి: ఈ తెలివి బాహ్యం నుంచి వస్తుంది. ఇది బయట వస్తువులనుండి, మనుష్యుల నుంచి వచ్చేది. దోషయుక్తము. దీనిని గ్రహించకుండడమే మేలు అనిపించే స్థితిలో నేడున్నది.
3. జ్ఞానం: బుద్ధి వికసించిన వారిలో మాత్రమే ఈ అతీంద్రియ జ్ఞానం బయటకు వస్తుంది. ఇది ఎప్పుడూ తప్పు చెప్పదు.
దీనికోసమే మన ఆరాటం.
బుద్ధి వికసించాలి అంటే బుద్ధి నే ప్రార్థించాలి. ఈ బుద్ధికి అధిష్టాన దేవతల ‘వేదమాత గాయత్రి’ ఆ తల్లిని మూడు కాలాలు త్రిసంథ్యలు మనబుద్ధిని ప్రచోదయమును చేయమని అంటే వికసింపచేయుమని వేడుకొనవలెను.
బుద్ధి ప్రచోదనమైన వెంటే పరమాత్మ వైపుకు అడుగులు చెప్పకుండానే పడుతాయి. మనము ఉపాధ్యాయుని చెంతకు వెళ్లి మా వాణికి విద్యాబుద్ధులు చెప్పమంటాం. బుద్ధిని తెలసుకొనేదే విద్య. విద్య పరమార్థం ఘనబుద్ధిని నేర్పటము, ఏ విద్యనేర్పడము వలన సమస్త విద్యలు అందులో అణిగి పోతాయో ఆ విద్యే బ్రహ్మవిద్య .
హిరణ్య కశిపుడు ప్రహ్లాదుడిని ఏమి నేర్చుకున్నావని అంటే అపుడు ప్రహ్లాదుడు చెప్పినట్లు అంటే... ‘‘చదివితిసర్వశాస్తమ్రులు... చదువులలో మర్మమెల్ల చదివితి తండీ!’’ అంటూ ఏమి నేర్చుకొన్నాననని చెప్పాడో ఆ చదువే ఆ విద్యనే బుద్ధిని ప్రకాశింప చేస్తుంది.
పరమాత్మ సామ్రాజ్యంలో ప్రవేశించాలంటే బుద్ధి గుహే ద్వారము. ఒకసారి బుద్ధి ఆత్మలో లయమైతే చెప్పడానికి చూడడానికి, వినడానికి ఏమీ ఉండదు. ఆ ఆనంద సముద్రములో మునిగిన వాడు ధన్యజీవి.

- కె. రఘునాథ్ 9912190466