AADIVAVRAM - Others

వరానే్వషణ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కళ్లల్లో కళ్లెట్టి నీ కళలన్ని పసికట్టి
కనుపాపల కదలికలే చదివా!!
పయ్యెదపై గురిపెట్టి పైటచాటు పరువాల పగరువాల
తులతూగె కనె్న సొగసులెరిగా!!
గుండెలో విషయం నే చదివిన వైనమెరిగి
రెప్పలార్చి ఏమార్చే తీరులని
ఓరకంట ఓ రకంగా నన్నాకర్షించే నెరజాణవని
తెరతీయమని కిర్రెక్కించే తొందరలని
చిత్ర విచిత్ర కులుకులని కులుకుల సాగే సొబగులని
వణికే పెదవుల నదిమే మునిపంటి తీరులని
నీ కన్నులు అదే పనిగ వెతికే దారులని
శృతిచేసే వైణికుడను ప్రేమికుడను నేనేనని
కనుసైగలు ఎనె్నన్నో నే చేశా
కనె్న ఎదను దోచేశా...
నిజం.. నిజం.. నిజం.. కాదంటే హజం..
నీ చూపు నన్ను తాకింది.. తపనలింత రేపింది...
ఇరు పెదవులు వణికినది.. తొలి మధువులు తొణికినది..
నా సరి నీవని.. నా గురి నీవని నిను వలచింది..
మది మురిసింది.. ఈ విరి విరిసినది..
మరులూరించే తూనీగ మీసాల
సొగసరి గడసరి మగసిరి నెలరేడివని
వగలెరిగిన చెలికాడివని
నీ కదలికలకు సొగసరి నేనేనని.

-ఆచార్య క్రిష్ణోదయ 74168 88505