Others

వరదాయని వరలక్ష్మిదేవి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

‘‘నమస్తేస్తు మహామాయే, శ్రీపీఠే సుర పూజితే; శంఖ చక్ర గదా హస్తే, మహాలక్ష్మీ నమోస్తుతే’’. శంఖ చక్ర గద ధారణియైన మహాలక్ష్మీ దేవి సంపద, భూమి, శిక్షణ, ప్రేమ, కీర్తి, శాంతి, సంతోషం, శక్తి లాంటి అష్టైశ్వర్య ప్రదాయిని. అష్టసంపదలు ఒసంగే జగన్మంగళ దాయిని. అష్టైశ్వర్యాలు కలుగజేసే రూపం వరలక్ష్మిగా ఆరాధనీయం. కొలిచిన వారికి కొంగుబంగారమై వరాలనిచ్చే జగజ్జనని వరలక్ష్మి.
అన్ని లక్ష్మీ పూజల కన్నా, వరలక్ష్మీ పూజ ఉన్నతమైనదని శాస్త్ర వచనం. వైకుంఠ నాథుని జన్మనక్షత్రమైన శ్రవణ నక్షత్రంతో కూడిన పౌర్ణమి కల శ్రావణ మాసంలో వరలక్ష్మిని ఆరాధిస్తే, విశేష ఫలమని భావన. ఆయురారోగ్య ఐశ్వర్య సంతోషాదులు లక్ష్మీదేవిని అత్యంత ప్రియమైన శుక్రవారం పూజిస్తేనే కలుగుతాయని శ్రీసూక్తం వివరిస్తున్నది. వరలక్ష్మిని షోడశోపచార పూజలతో సేవిస్తే అష్టైశ్వర్యాలు, అయిదవతనం, సత్సంతానం, సంతానాభివృద్ధి కలకాలం ఉండగలవని శాస్త్ర వచనాలు. సకల కోరికెలు ఈడేరాలని, సర్వమంగళ సంప్రాప్తి కలగాలని, నిత్య సుమంగిళిగా వర్దిల్లాలని ఈ వ్రతాన్ని వివాహితులు వ్రతాన్ని ఆచరిస్తారు. శ్రావణ శుక్ల పక్షంలో పౌర్ణమికి ముందు అరుదెంచే శుక్రవారం సువాసినులు వరలక్ష్మీ వ్రతాన్ని ఆచరించడం హిందూ సంప్రదాయం. మంచి భర్త, సత్సంతానం కలుగాలని అమ్మాయిలు పూజిస్తారు. కైలాస నాథుడు, పార్వతీదేవికి వరలక్ష్మీ వ్రతాచరణ గురించి వివరణ స్కంద పురాణంలో ఉంది. లోకంలో స్ర్తిలు సకలైశ్వర్యాలు, పుత్రపౌత్రాదులను కలిగేందుకు ఏదైనా వ్రతం గురించి తెలపాలని పార్వతీ దేవి, పరమ శివుని కోరగా, వరలక్ష్మీ వ్రతాన్ని అభయంకరుడుడైన శంకరుడు వివరించారు. ఈ సందర్భంలోనే భర్తపట్ల ఆదరాన్ని, అత్తమామల పట్ల గౌరవాన్ని ప్రదర్శించిన మగధ రాజ్య అంతర్గత కుండిన నగర వాసియైన పరమ సాధ్వి చారుమతి ఉత్తమ ఇల్లాలిగా ప్రవర్తించిన నేపథ్యాన్ని వివరించారు. మహాలక్ష్మిని చారుమతి చిత్తశుద్ధితో పూజించిన క్రమంలో వరలక్ష్మి ఆమెకు స్వప్న సాక్షార్కారమై, శ్రావణ పౌర్ణమి ముందు వచ్చే శుక్రవారం తనను ఆరాధిస్తే, కోరిన వరాల్ని ఒసంగెదనని వరమిచ్చినట్లు కథనం. ముందుగా గణపతిని పూజించి, కలశం లోనికి అమ్మవారిని ఆవాహన గావించి, షోడశోపచార పూజ, అథాంగ పూజ చేయాలి. అష్టోత్తర శత నామాల యుక్త దూప, దీప, నివేదన, తాంబూలాలను సమర్పించి, కర్పూర నీరాజనం, మంత్రపుష్ప, మంగళ హారతి సమర్పణ గావించి, తొమ్మిది దారపు పోగులతో తొమ్మిది ముడులను వేసి, మధ్యన పంచ పుష్పాలను కట్టి తోర గ్రంథిని చేసి తోర గ్రంథి పూజ, తోరగ్రంథి మంత్ర పఠనం చేయాలి. ‘‘లక్ష్మీం క్షీరసముద్ర రాజ తనయాం, శ్రీరంగ ధామేశ్వరీం, దాసీభూత సమస్త దేవ వనితాం, లోకైక దీపాంకురాం, శ్రీమన్మంద కటాక్ష లబ్ద విభవ:, బ్రహేంద్ర గంగాధరాం, త్వాం త్రిలోక్య కుటుంబినీం సరసిజాం, వందే ముకుంద ప్రియాం’’ అని స్తుతించాలి. నవ సూత్ర ధారణను కుడి చేతికి చేయాలి. ఫలభక్ష్య పానీయ పాయసాదులను అమ్మవారికి సమర్పించి, చివరగా వాయన దాన మంత్రంతో ముత్తయిదువను మహాలక్ష్మిగా భావించి, తాంబూలం అందించాలి.

-సంగనభట్ల రామకిష్టయ్య 9440595494