Others

సూర్య శతకం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తే.గీ. వృద్ధులనుఁ జేరి మాటాడి విసుగుఁ గొనకఁ
గాస్తసమయము వారితో గడపినంత
వారియాయువుఁ బెంచిన వారలౌదు
రట్టివారల యాసీస్సులద్భుతాలు
చూడుమో కర్మసాక్షి! యో సూర్యదేవ!
భావం: వృద్ధుల చెంతకు చేరి ప్రేమగాను, ప్రీతిపూర్వకంగాను మాట్లాడి ఏ మాత్రం విసుగుచెందకుండా కాస్త సమయం వారితో గడిపితే, వారికి కలిగే మనశ్శాంతి మాటల్లో చెప్పలేము. మనశ్శాంతినిచ్చిన మనలను వారు తృప్తిచెంది మనకు వారందించే ఆశీర్వాదాలు అద్భుతాలను ఆవిష్కరిస్తాయని కర్మసాక్షివైన ఓ సూర్యదేవా అందరికీ తెలియజేయుమా !
తే.గీ. పెద్దవారన్నఁ గొండంత పెట్టువారు
వారి పంచన బ్రతుకులు పండు; వారి
జీవితపు పాఠములువినఁ జింతలేవి
దరికిఁ జేరంగరాఁ బోవుదప్పిపోయి
చూడుమో కర్మసాక్షి! యోసూర్యదేవ!
భావం: పెద్దవాళ్లంటేనే మనకి కొండంత ధైర్యం వస్తుంది. వారు చెంతనుంటే మన బ్రతుకులు పండుతాయి. ఎన్నో అనుభవాలను కాచివడబోసిన వాళ్లు వారు. వారి జీవితానుభవ పాఠాలు వింటుంటే మనకు ఎదురైన చింతలకు వెరవకుండావాటిని సులభంగా దూరం చేసుకోవచ్చు. ఈ విషయాన్ని లోకులందరికీ తెలియజేయుమయ్యా ఓ సూర్యదేవా!

- కొడుకుల సూర్యసుబ్రహ్మణ్యం 9492457262