Others

హితమే అవసరం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

‘‘భద్రం కర్ణ్భిః - మా చెవులు ఎప్పుడూ శుభప్రదమైన వార్తలనే వినవలెను. మా కన్నులు ఎప్పుడూ మంగళకరమైన సన్నివేశాలనే చూడవలెను.సర్వవేళలా మానవాళికి ఎప్పుడూ సన్మంగళము కలుగుగాక - అని వేదంచెబుతుంది. ఈ మంత్రాలే మానవాళికి మహాభ్యుదయాన్ని కలిగిస్తుంటాయ. అందుకే మన పెద్దలు శుభానే్న పలుకాలి అంటారు. ఎపుడైన అనుకోని కారణాలతో అనుకోనివి జరిగితే అమంగళం అమంగళం దూరం కావాలి అని వెంటనే అనేవారు. తథాస్సు దేవతలు పైన తిరుగుతుంటారు . వాళ్లు తథాస్సు అంటే అది నిజమైపోతుంది కనుక అసత్యాలకు అధర్మాలకు దూరంకండి. అధర్మమెపుడూ నాశనానికే దారితీస్తుంది అని చెప్పేవారు. కలియుగంలోనూ అధర్మం చాలా బాగున్నట్టు మొదట్లో కనిపించవచ్చు. ఎవరికైనా అన్యాయం చేస్తుంటే అన్యాయానికి గురైనవాళ్లు బాధపడుతూ అన్యాయం చేసినవారిని రక్షించమని కోరుకుంటుంటే ఆనందాన్ని అనుభవించటం అంటే అది రాక్షసానందమే అవుతుంది. ఇది కొంతకాలమే బాగుంటుంది. కానీ అన్నీ కాలాలు అందరికీ ఒకేలా ఉండవు కనుక అన్యాయాన్ని అనుభవించినవారే కాక అన్యాయం చేసినవారికి కూడా కాలం తిరుగబడవచ్చు. అపుడు తాటిని తనే్నవాడుంటే వాని తలను తనే్నవాడు ఇంకొకడు పుట్టేఉంటాడు. అపుడు ఎందుకు ఇలా చేశామా అని బాధపడేరోజును ఎదుర్కోవాల్సి ఉంటుంది. కనుక ఎపుడూ ఎవరికీ అన్యాయం చేయకూడదు. ఎదుటివారి కంటిలో ఉబికే నీటికి కారణమైన వారు ఎక్కడో ఒకచోట వారి కంటినుంచి నీరుకార్చే రోజు వస్తుంది. కనుక ప్రతివారు తన తోటివారందరూ బాగుండాలని కోరుకోవాలి. చరిత్రలో ఎంత బలవంతులైన రాక్షసులైనా, లేదా ఎన్ని వరాలనుపొందిన వారైనా సరే ఇతరులను బాధపెట్టిన రోజు వారు భగవంతుని దండనకు గురైనవారే అని తెలుస్తుంది. గతాన్ని తెలుసుకొంటే అందులోంచి గుణపాఠం నేర్చుకని మంచిదారిలో వెళ్లాలి.

- శ్రీ