Others

ఆరోగ్యప్రదాత శ్రీ వైద్యనాథస్వామి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

భారతదేశంలో శివతత్వాన్ని ప్రబోధించే జ్యోతిర్లింగాలలో పరళీవైద్యనాథ్ దేవాలయం ఒకటి. ఇది మహారాష్టలోని బీడ్ జిల్లాలోగల అంబేజోగాయి నుంచి కేవలం 26కిలోమీటర్ల దూరంలో ఉంది. 12 జ్యోతిర్లింగాల్లో ఐదు మహారాష్టల్రోనే ఉన్నాయి. కొన్ని జ్యోతిర్లింగాలు సాగర తీరంలో మరికొన్ని నదీతీరాల్లో ఇంకొన్ని పర్వత శిఖరాలపై ఇంకొన్ని మైదానపు ప్రాంతాలల్లో వివిధ రూపాల్లో కనిపిస్తాయి.
ఈ శుభంకరమైన జ్యోతిర్లింగాల దర్శనం వలన మన జీవితాలు సుఖసంతోషాలతో పాటు ధార్మిక ఆలోచనలతో పుణ్యఫలాలు దక్కించుకుంటాయి. దేవాలయాల సందర్శనతో మనుష్యుల్లో భక్తిశ్రద్ధలు అలవడుతాయి. ధార్మికమైన ఆలోచ నలు కలుగుతాయ. వారి నడవడిలో మార్పు కొట్టవచ్చినట్టు కనిపిస్తుంది.
స్థల పురాణం: దేవదానవుల అమృతమధన సమయంలోని ఓ కథ ఇక్కడి స్థలపురాణంలో చెప్తారు. దేవదానవులు కలసి పాలకడలిని మర్ధించేటపుడు అందులోంచి అమృతంతో పాటుగా 14 రత్నాలు వెలికివచ్చాయట. వాటితోపాటుగా ధ్వనంతరి కూడా లభించారట. వీటిని అందిపుచ్చు కోవడానికి దానవులు ముందుకు వస్తుండడం చూసి విష్ణుమూర్తి రత్నాలతోపాటుగా ధన్వంతరినీకూడా శివుని లింగాకారంలో దాచేశాడట. వాటి ప్రస్తావన లేకుండానే మహావిష్ణువు మోహినీ అవతారం దాల్చి దేవదానవులను వరుసలో కూర్చోబెట్టి అమృతాన్ని దేవతలకు మాత్రమే ఇచ్చాడట.
అట్లా దాచిన లింగాకారమే ఇక్కడి శివాలయంలో ప్రతిష్ఠించినట్లు చెప్తారు. అందుకనే ఇక్కడి శివలింగాన్ని అమృతలింగమని అంటారు. శివుడిని అమృతేశ్వరుడనే నామంతో వ్యవహరిస్తారు. ఈ శివలింగంలో రత్నాలు, ధన్వంతరి ఉన్న విషయం రాక్షసులు తెలుసుకొని లింగాన్ని పెకిలిద్దామని రాక్షసులు వెళ్తే ఆ లింగం నుంచి అగ్ని జ్వాలలు రేగాయట. దానితో రాక్షసులు భయపడి అక్కడి నుంచి వెళ్లిపోయారట.
కానీ, శివభక్తులెవరైనా ఈ శివలింగాన్ని దర్శనం చేసుకొంటే వారు రోగాల బాధనుంచి విముక్తులైయ్యేవారట. అందుకనే ఈ శివలింగాన్ని వైద్యనాథుడనే పేరు ప్రఖ్యాతమైందని స్థలపురాణం చెబుతుంది.
మరోకథనం ప్రకారం రావణాసురుడు మహాదేవుడికోసం తపస్సు చేయగా శివుడు ప్రత్యక్షమై ఏం వరం కావాలో కోరుకోమని అడిగితే రావణాసురుడు నీ ఆత్మలింగం కావాలని కోరుకున్నాడట. భక్తవత్సలుడైన భక్తవశంకరుడు నా ఆత్మలింగాన్ని లంక చేరేంతవరకు కిందిపెట్టకుండా వెళ్లు. ఒకవేళ ఏ ఆటంకం వచ్చి కిందపెట్టితే నా ఆత్మలింగం అక్కడే ప్రతిష్ఠించబడుతుంది అని చెప్పాడట.
రావణాసురుడు అతి జాగ్రత్తగా తీసుకొని వెళ్తుండగా కృష్ణమాయా ప్రభావం వల్ల సంథ్యాసమయం ఆసన్నవౌతుంది. సంద్యవార్చడమెలాఅని రావణాసురుడు ఆలోచిస్తూంటే అక్కడే గోవులను కాస్తూ గోపాలుడు చిన్న పశువుల కాపరిగా రావణాసురునికి కనిపించాడట. అపుడు ఆ పశువుల కాపరిని పిలిచి ఆత్మ లింగం ఆయనకు ఇచ్చికాస్త పట్టుకుని ఉండు సంధ్యవార్చుకుని వస్తా నంటే ఆ గోపాలుడు నేను కొద్దిసేపు చూస్తాను. నేను బరువు మోయలేను. బరువు అనిపించిన వెంటనే నేను మూడు సార్లు పిలుస్తాను. అపుడు నీవు రాకపోతే కింద పెట్టేస్తాను అన్నాడట. కానీ రావణుడు దగ్గర ఉన్నజలాశయం ఏది అని వెతికి అందులో పూర్తిగా నీళ్లల్లోకి దిగగానే గోపాలుడు రావణా అని మూడు సార్లు పిలిచాడట. అంతే ఆ పిలుపు రావణుడు విని వస్తున్నా అంటూ పరుగెత్తి వచ్చేలోపే గోపాలుడు శివుని ఆత్మలింగాన్ని కిందపెట్టేసాడట. ఆ లింగమే ఇపుడు వైద్యనాథలింగంగా ప్రసిద్ధి చెందినట్లుకూడా చెప్తారు.
ఈ వైద్యనాథాలయాన్ని రాతితో నిర్మించారు. ఈ దేవాలయపు రాతికట్టడంలో ఎన్నో వింతలు విశేషాలున్నాయి. ఈ దేవాలయంలోని శివలింగం అనేక సాలిగ్రామాలతో చేయబడింది. ఇక్కడి వచ్చే భక్తులంతా ఈ వైద్యనాథ లింగానికి స్వయంగా అభిషేకాదులు నిర్వర్తించుకోవచ్చు.
విశిష్టమైన కొన్ని సమయాల్లో ప్రత్యేకంగా తూర్పున ఉదయించిన బాలభానుడు ఈ వైద్యనాథుని పైకి తన కిరణాలను ప్రసరింపచేస్తూ శివునికి నమస్కరిస్తాడట. సూర్యకిరణాలు పడే సమయంలో ఈ వైద్యనాథుని దర్శించుకున్నవారికి గ్రహపీడలు, మానసిక వ్యాధులుకూడా దూరమవుతాయని ఇక్కడి వారు చెబుతుంటారు. ఈ ఆలయ ప్రాంగణంలో శ్రీకృష్ణ్భగవానుడు కూడా కొలువై ఉన్నాడు. వైష్ణవాలయంలో చేసే వేడుకలన్నీ ఈ కృష్ణ్భగవానునికి కూడా శైవవైష్ణవ భేధాభిప్రాయాలు లేకుండా కనులపండువగా చేస్తారు. దీర్ఘ రోగాలున్నవారు కూడా ఈ వైద్యనాథుని దర్శనం చేసుకొంటే వారు ఆ యా రోగాలనుంచి విముక్తులు కావచ్చునని ఇక్కడ వైద్యనాథుని దర్శించుకున్నవా రు చెప్తుంటారు.

- జొన్నాభట్ల నసింహప్రసాద్ 7995 900497