Others

సుభాషితాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆశానామ నది మనోరథ జల తృష్ణ తరంకులా
రాగ గ్రాహవతి వితర్క విహాగా ధైర్య దృమధ్వంసిని
మోహవర్తసుదుస్తరాస్తిగహనా ప్రోత్తుంగ చింతాతటి
తస్యాః పారగతా విశుద్ధమనసో నందతి యోగీశ్వరాః

భావం: ఆశ అనే పేరు గల నదిలోని నీళ్లు కోరికలు. దురాశ నదిలో కలిగిన తరంగాల వంటివి. నదిలోని మొసళ్లు లాంటివి తీవ్రమైన కోరికలు. అనుమానం అనే పక్షి యొక్క బలం ధైర్యం అనే చెట్టును కూల్చేస్తుంది. భ్రమలు సుడిగుండములవంటివి . నది చాలా లోతైనది. దాని ఒడ్డున బాధలు అనే ఎతె్తైన పర్వతాలున్నాయి. నదిని దాటటం చాలా కష్టం. ఐతే ఎవరైతే మనస్సును క్రమబద్ధం చేసుకుంటారో, ఆశ అనే నదిని అవలీలగా దాటి సంతోషంగా ఉంటారు.
అందుకే మనిషికి ఆశ ఉండాలి. అది జ్ఞానం వైపుకు మరలాలి. ఆశతో మనిషి ముందుకు వెళ్లాలి. అనుకున్న పనులను సకాలంలో సన్మార్గంలో పూర్తి చేయడానికి ఆశ పనికిరావాలి. ఆశ ఎపుడూ దురాశ కాకూడదు. దురాశ దుఃఖానికి చేటు తెచ్చేదే అవుతుంది కానీ సుఖానికి నిచ్చెన కాలేదు. కనుక ఆశ పట్ల ప్రతిమనిషి జాగరూకతతో వ్యవహరిం చాలి. అంతేకాక అనుమానం అనేమొసళ్ళకు బానిసలు కాకూడదు.