Others

గీతాజ్ఞానం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హిందువులందరికీ భగవద్గీత పరమ ప్రాణికమైన గ్రంథం. గీతను చదివితే చాలు, ఆ గీతను అర్థం చేసుకొంటే చాలు జీవితం ఏవిధంగా సార్థకం చేసుకోవచ్చో తెలిసిపోతుంది. కఠినమైన విషయాలను కూడా సున్నితంగా పరిష్కరించుకోగల నైపుణ్యం ఏర్పడుతుంది. ప్రారబ్ధకర్మలను అనుభవించేవారు సైతం గీతను రోజు పారాయణ చేసినట్లయతే వారు ఆ కర్మలనుంచి విముక్తులు కావచ్చు.
గీత జ్ఞానంతో ముక్తి ని కూడా పొందవచ్చు. మానవజన్మను సార్థక్యం చేసుకోవటానికి గీతా పఠనమే ముఖ్యసాధనం. గీతయే పరమవిద్య. బ్రస్మస్వరూపం . అర్థ మాత్రాస్వరూపం. నిత్యమైనది. సత్యమైనది. అనిర్వచనీయమైన గుణాలను కలిగినది. వేద సారం. పరమానంద స్వరూపం. గీతను ఆశ్రయించినవారికి తత్త్వజ్ఞానాన్ని ప్రసాదిస్తుందని భూదేవికి గీతామహాత్యమును స్వయంగా శ్రీకృష్ణ్భగవానుడే చెప్పాడు.
ప్రతిరోజు గీతాశ్లోకాలను పఠించడం, లేదా గీతోపన్యాసాలు వినడం బహు ఉత్తమమైన విషయం. భగవంతునిపైన విశ్వాసం ఏర్పడుతుంది. సంసారంలోని దుఃఖాలు తొలిగిపోతాయి. పరమానంద ప్రాప్తి కలుగుతుంది. జనుల్లో నైతిక, ఆధ్యాత్మిక విలువలు పెంపొందుతాయి. గీతాగ్రంథమున్నచోటనే సర్వ తీర్థాలుంటాయి అనడంలో గీతను అర్థం చేసుకొని గీతను ఆచరణలో పెట్టినవారికి సర్వ సౌఖ్యాలుకలుగుతాయి. గీతను ఆచరణలో పెట్టినవారికి ఇహపరసుఖాలు తప్పక లభ్యమవుతాయి.గీతా ప్రచారాన్ని భగవత్ కైంకర్యంగా భావించి ఎంతోమంది గీతాజ్ఞానాన్ని అందిరికీ అందిస్తున్నారు. గీత మత గ్రంథం కాదు కానీ గీత సర్వులకు హితబోధిని. ఎంతోమంది జనులు గీతను అనుసరించి తమ తమ జీవితాలను ఆనందమయం చేసుకొన్నారని చెబుతుంటారు.
గీతా గంగాచ గాయత్రీ గోవిందేతి హృదిస్థితే
చతుర్గకార సంయుక్తే పునర్జన్మ న విద్యతే
గీత, గంగ, గాయత్రి, గోవిందుడను నాలుగు ‘గ’కారయుక్త పదార్థాలను ఎవరు మదిలో ధరిస్తారో వారికి పునర్జన్మలేదు అని పెద్దలు చెబుతున్నారు.

- పి.వి. సీతారామమూర్తి 9490386015