Others

విశే్లషణాత్మక పరిశోధనా గ్రంథం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

‘దేశ భాషలందు తెలుగు లెస్స’ అని తన కావ్య అవతారికలలలో తెలుగు భాష గొప్పదనాన్ని చాటిచెప్పిన రాయలవారి జీవిత సమగ్ర విశే్లషణకు ‘మూరురాయగండడు శ్రీకృష్ణదేవరాయలు’ అనే గ్రంథాన్ని పరిశోధనాత్మకంగా ఎస్.డి.వి.అజీజ్ వ్రాయడం ఎంతో అభిలషణీయం.
కాకతీయ సామ్రాజ్యం ఢిల్లీ సుల్తానుల దురాక్రమణ గురై పతనమైన తరువాత ఏర్పడిన విజయనగర సామ్రాజ్యాన్ని ఏలిన రాజవంశాలలోని తుళువ వంశరాజులలోని అరివీర భయంకరుడు ఆంధ్రభోజునిగా, సాహితీ సమరాంగణ సార్వభౌముడిగా త్రిసముద్రాధీశ్వరుడుగా పేరుగాంచినది శ్రీకృష్ణదేవరాయలు క్రీ.శ. 1510లో రాజ్యాభిషేకం అయిన దగ్గరనుంచి క్రీ.శ.1530 సంవత్సరములో మధుమేహ అనారోగ్యానికిగురై మరణించినంత వరకు గల శ్రీకృష్ణదేవరాయలవారి చరిత్రను అన్ని కోణాలలో కళ్ళకు కట్టినట్లు చిత్రీకరించారు.
కాకతీయ సామ్రాజ్యంలో శైవానికి ఎక్కువ ప్రాధాన్యత కలదు. దీని మూలంగా ఇతర మతాల, కులాల వైషమ్యాలు పెరిగి మాలిక్ కాఫర్‌కు తొత్తులైన విశ్వసఘాతుకానికి ఒడిగట్టిన స్వజనుల దుర్మార్గానికి గణపతి దేవుని రాజ్యము పతనమైనది. ఈ విషయాన్ని గ్రహించిన శ్రీకృష్ణదేవరాయలలు శైవముతోపాటు వైష్ణానికి అత్యంత ప్రాధాన్యం ఇచ్చిన తాతాచార్యులను గురువుగా చేసుకొన్నారు. అంతేగాక తన సైన్యంలో అన్ని మతాల జాతులవారిని చేర్చుకొని వారికి తగు ఉచిత ప్రాధాన్యతను, సత్కార్యాలను చేస్తూ అందరి మన్నలను పొందారు. ముందుచూపుతో పోర్చుగీసువారితో స్నేహం చేసి మేలు జాతి గుర్రాలను, మందుగుండు సామగ్రిని తన సైనిక పటాలములో చేసుకొని బహమనీ సుల్తానుల గుండెలలో గుబులు రేకెత్తించాడు. అరేబియా సముద్రమునుంచి బంగాళాఖాతము వరకు క్రింద హిందూ మహాసముద్రమువరకు జైత్రయాత్ర చేశారు. వీరు దండెత్తిన ప్రతి ప్రాంతంపై విజయం సాధించడం చరిత్రలో ఒక్క శ్రీకృష్ణదేవరాయలకే చెల్లింది.
రచయిత చాలా కష్టపడి వివిధ అంశముల గురించి విపులంగా వ్రాశారు. మేము చిన్నప్పుడు చదివిన, విన్న విషయాలన్నింటిని ఒక క్రమ పద్ధతిలో పెట్టి పాఠకులకు అందించడంలో సఫలత సాధించారు.
రాయలకాలంనాటి పాలనా వ్యవస్థను సమగ్రంగా వివరించారు. వారు అవలంభించిన శిస్తు విధానాలలో చివరకు మంత్రులు సేనాధిపతులు కూడా పన్నులు చెల్లించారు అని వివరించారు. ఇక స్ర్తిల సమస్యలు, ఆనాటి శిక్షల గురించి, వైద్య విధానం, ఆహారపు అలవాట్లు, బానిస వ్యవస్థ వివరించారు. రాయలవారికి సంగీత సాహిత్య, చిత్రకళల పట్ల అభిలాషను అష్టదిగ్గజ కవుల వివరాలను, ఆనాటి వేశ్యావృత్తులను, ఆహార వ్యవహారాలను, అతిథి సత్కారాలను చర్చించారు. ఇక దానధర్మాలు, దేవాలయాలకు విరాళాలు ఇచ్చిన విషయంలో రాయలవారే కాక అతని సామంత రాజులు, మంత్రులు కూడా ఎంతో గొప్పగా వితరణ చేశారు. దాదాపు 39 ప్రధాన దేవాలయాలకు మాన్యాలు ప్రదానం చేసినట్లు తెలియపరిచారు. ఏడుకొండలవానిపై శ్రీకృష్ణదేవరాయలకు ఎంతో మక్కువ. ఇష్టదైవం కనుకనే మూడు సార్లు మహారాణుల సమేతంగా స్వామివారిని దర్శించుకొని ఎన్నో విలువైన కానుకలు, తమ ఇద్దరు దేవేరులతో కూడిన తన ప్రతిమలను స్వామివార్లకు సమర్పించారు. బహుశ అందుకేనేమో ఈ రోజుల్లో నాయకులు కూడా శ్రీ వేంకటేశ్వరస్వామిని తరచుగా దర్శించుకుంటూ ప్రజలు సుఖ సంతోషాలతో ఉండాలని ప్రార్థిస్తున్నారు.
ఏ రచయిత చరిత్ర గురించి వ్రాసినా ఎంత కొంత తనకు ఇష్టమైన అంశాలను అందులో పొందుపరచడం సహజం. రచయిత తిమ్మరుసు పాత్ర చిత్రణలో సహజంగా తనకు వున్న అభిమానంతో ఒక వర్గంవారిని కించిత్తు ఎక్కువగా విమర్శించినట్లు కనపడుతున్నది. కారణం- ఎవరికైనా అధికారంలో వున్నపుడు తన వర్గంవారికి సహాయం చెయ్యడం సహజం. ఆ భావం వచ్చే విధంగా తర్కించి వ్రాసి చదివే పాఠకుడికి రచయిత బాగా దగ్గరయ్యేవారు. శ్రీకృష్ణదేవరాయల దగ్గర నుంచి ఆంగ్లేయుల వరకు యంత్రాంగంలో అగ్రవర్ణములను, రక్షణ రంగంలో ముస్లిం వర్గీయులను మాత్రమే నమ్మేవారు. కారణం వారు నిజాయితీపరులు. ఈనాటి అవినీతి తిమింగలాలవలె వారు కాదు. ఈ రెండు వర్గాలవారు తినరు, తన వర్గీయులను తననివ్వరు. అందుకే వారు నమ్మదగినవారు. ఇవేవారిలో కూడా కొంతమందికి మినహాయింపు లేకపోలేదు.
ఇక ఆఖరుగా అనుబంధంలో విజయనగర సామ్రాజ్య నిర్మాణానికి ముందుగా వున్న అనెగొంది గురించి చాలా బాగా వ్రాశారు. అరుదైన చిత్రాలను ముద్రించారు. కొందరు రాజవంశీకుల చిత్రపటాలు ఉన్నాయి.
రచయిత ఎస్. అబ్దుల్ అజీజ్‌గారు మంచి రచయిత. స్టేజీ నాటకాలు, రేడియో నాటకాలు, పరిశోధన గ్రంథాలు, సాంఘీక నవలలు రచించారు. అనేక పురస్కారాలు గ్రహించారు. వీరి కలంనుండి ఇంకా ఎన్నో విలువైన రచనలు రావాలి అని ఆ భగవంతుని మనసారా కోరుకుంటున్నాను. చరిత్ర తెలుసుకోగోరే పాఠకులకు ఈ పుస్తకము ఒక సమగ్ర విశే్లషణ గ్రంథము.

-జొన్నాభట్ల నరసింహప్రసాద్ 7995900497