Others

సూర్య శతకం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తే.గీ. ఆత్మవిశ్వాసముం గల్గియడుగులవియు
వేగవంతానఁ గదుపంగ విజయపథము
గోచరించును మనకు సంకోచమేల?
చూడుమో కర్మసాక్షి! యో సూర్యదేవ!

భావం:- అంతా ఆత్మవిశ్వాసాన్ని కలిగియుండి వేగవంతంగా ముందడుగులు వేసిన పక్షంలో విజయపథం మన కళ్లముందు కనబడుతుంది. ఈ విషయంలో ఎలాంటి సందేహానికి తావేలేదన్న సత్యాన్ని కర్మసాక్షివైన ఓ సూర్యదేవా లోకానికి తెలియజేయుమయ్యా స్వామీ.
తే.గీ. మృదు మధురమైన వాక్కులు మేలుగూర్చు
నితరులకుఁ దృప్తినవియిచ్చునెట్టివేళ
లందుఁ బరుషవాక్కులఁ బల్కరాదు సుమ్మి
చూడుమో కర్మసాక్షి! యో సూర్యదేవ!

భావం:- మృదుమధురమైన మాటలు మాట్లాడడం వల్ల ఉభయులకూ మేలుకలుగుతుంది. ఆ మాటలు ఎదుటివారికి తృప్తినిస్తాయి. ఏ సందర్భంలోనూ పొరపాటున కూడా పరుషంగా మాట్లాడడం తగదని కర్మసాక్షివైన ఓ సూర్యదేవా! ఈ లోకానికి ప్రబోధించవయ్యా ప్రత్యక్ష ప్రభాకరా!

- కొడుకుల సూర్యసుబ్రహ్మణ్యం 9492457262