Others

మహిమాన్వితం...దత్తుని అవతారం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వేదకాలంలో ఇంద్రాది దేవతల ప్రాముఖ్యం అధికం. పురాణకాలమందు మూర్తిత్రయం ఏర్పడినది. బ్రహ్మ, విష్ణువు, పరమేశ్వరుడు ముగ్గురు మూర్తులు భిన్నులు కారని, ఒక్కరేయని, దేవుడు ఒక్కడే అనే వేద ప్రమాణమును అన్వయించేందుకే దత్తాత్రేయ ఉద్భవ సందర్భం కలిగింది. అలాగే పాతివ్రత్య మహాత్మ్యం చేత సాక్షాత్ దేవదేవులనైనా, తారుమారు చేయవచ్చునని బోధించడం కూడా త్రైమూర్త్య స్వరూప ఆవిర్భావ ఉద్దేశితం. భూలోకంలో పేరుమోసిన స్ర్తిరత్నమైన అనసూయ పాతివ్రత్యం గురించి, పరీక్షించేందుకు భార్యల ఆలోచనల ఫలితంగా త్రిమూర్తులు బ్రాహ్మణ వేషాలతో అత్రి మహాముని ఆశ్రమానికి రాగా, తమకు ఆకలిగా ఉందని, విగత వస్తయ్రై భోజనం పెట్టాలని కోరగా, తన భర్తతో అనసూయ ఆలోచన చేయగా, ఆత్మజ్ఞానియైన అత్రికి వచ్చినవారు త్రిమూర్తులేనని గ్రహిస్తాడు. భర్త ఇచ్చిన మంత్రోదకం ముగ్గురిపై చల్లడంతోనే పసిపాపలుగా ముల్లోకాధిపతులు మారగా, వారికి స్తన్యం ఇచ్చి తృప్తి పరుస్తుంది. ఈ విషయం నారదుని ద్వారా విన్న లక్ష్మి, పార్వతి, సరస్వతి నారదుని వెంట వెళ్ళి, బాలురై క్రీడిస్తూ ఉన్న భర్తలను గాంచి, గర్వభంగం పొంది, తమ పతులను తమకు ఈయవలసిందిగా ప్రార్థిస్తారు. మళ్ళీ మంత్రోదకం చల్లడం ద్వారా విధి, నీలకంఠ, నీలవర్ణ రూపులైన త్రిమూర్తులను నిజరూపాలతో అప్పగిస్తుంది. అనసూయ పాతివ్రత్యానికి మెచ్చిన త్రిమూర్తులు వరం కోరుకొమ్మన్న సందర్భంలో, తమకు వారు పుత్రులుగా జన్మించాలని, కోరగా, వెంటనే వారి అంశలతో, ముని దంపతులకు కుమారుడుగా పుడతాడు. త్రిమూర్తుల స్వరూపుడు, త్రిముఖ దేహుడు, దేవుడు అయిన దత్తాత్రేయుడు గురు స్వరూపానికి మూలం. కృత, త్రేతాది యుగాల్లో విష్ణుమూర్తి రాక్షస సంహారార్థం భువిపై అవతరించారు. అజ్ఞానమనే చీకటిని తొలగించి, జ్ఞాన జ్యోతులను వెలిగించేవాడు గురువు. అలాంటి గురు స్వరూపానికి మూలం దత్తాత్రేయుడు. కలియుగంలో మానవజాతికి జ్ఞాన కాంతులను ప్రసరింప జేసేందుకు గురు రూపంలో దత్తాత్రేయుడు అవతరించారు. ఆయన అవతరించినది మార్గశీర్ష శుక్ల చతుర్దశి అయినా, జయంతిని జరుపుకునే దినమే మార్గశిర పౌర్ణమి అనగా ‘దత్తపౌర్ణిమ’. అనసూయా, అత్రి మహాముని పుత్రునిగా జన్మించిన దత్తుని అవతారం మహిమాన్వితం. అనసూయ కోరిక తీర్చేందుకు త్రిమూర్తుల ఆత్మజుడైన దత్తుడు గురుమూర్తిగా, అవదూతగా, ప్రాణిమాత్రులను సంసారజాలం నుండి విముక్తి చేస్తూ, ఆత్మ సాక్షాత్కరం చేయడం కోసం అవతరించాడు. దత్తాత్రేయుడు గొప్ప సన్యాసి. ఆయన మార్గశిర శుక్ల పక్ష చతుర్దశి కృత్తికా నక్షత్రం నాడు జన్మించారు. దత్తాత్రేయుడు యదు మహారాజుకు స్వశరీర పవ్రితత, పరుశురామునికి శ్రీవిద్యా మంత్రం, సుబ్రహ్మణ్య స్వామికి ఆధ్యాత్మవిద్యోపదేశం, ప్రహ్లాదుకి జ్ఞానమార్గోపదేశ,, నాగార్జునునికి ధాతు విద్యా ప్రక్రియను, రసశాస్త్రాన్ని, ఆది శంకరులకు సహస్రనామోపదేశం చేశారు. దత్తాత్రేయుడు ఉగ్ర దేవతగా గర్గసంహిత చెపుతున్నది. అందుకే కాబోలు దేశంలో దత్త దేవాలయాలు మిక్కిలి తక్కువగా ఉన్నాయి. యమదంష్ట్రులను తుదముట్టించినందుకు సంతోష సూచకంగా ఉగ్ర దైవమగు దత్తునికి ఇష్టమైన గురువారం పూజించడం ఆచారంలోనికి వచ్చింది. ఔదంబరం (అత్తి-మేడి) మొదట్లో ఉండడం ఆయనకు ప్రియం కనుక జంతుఫలి అని పేరు కలిగిన మేడిని హిందువులు పూజ్యభావంతో చూస్తారు. ఆ చెట్టుకింద కూర్చుని, దత్త మంత్రం పఠిస్తే అమోఘ ఫలితం ఉటుందని విశ్వాసం. జన్మ, కర్మ, గుణ, రూప, మాయ, నాశనాలు లేని సర్వాంతర్యామియైన దత్తాత్రేయుని జన్మదిన వేడుకలను సాంప్రదాయ రీతిలో జరుపుకోవడం అనవాయితీ. ఉట్టి ఉత్సవాలు, పూజాదికాలు, కీర్తీనలు, పురాణ శ్రవణాలు నిర్వహించడం ఆచరణీయం.

- సంగనభట్ల రామకిష్టయ్య