Others

మార్గళి గీతాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తిరుప్పావై మూలానికి తెలుగు
- ఆసూరి మరింగంటి శేషగిరిచార్య
9886976760
*
1. శ్రీకృష్ణుని కృపను బడయు
శ్రీకరవౌ సమయమ్మిది;
వినుడి నిండు వెనె్నలున్న
ధనుర్మాస వ్రతకాలము

2. బృందావన సుఖ విహారి
మందహాస వదనముగల
నందగోప బాలకుడగు
మాధవునే సేవింతము

3. దీప్తులెసగు తొడవులుగల
వ్రేపల్లియ పడచులార!
నారాయణు వ్రతము సలుప
రారండని గోద బిలిచె

4. యశోద గారాలపట్టి
యదువంశపు మణిరత్నము;
నీలమేఘశ్యాముండౌ
బాలసింగమే వెన్నుడు

5. రవిచంద్రుల భాతి వెలుగు
కావి వనె్న కంజాక్షుడు;
ముద్దులొలుకు మోమువాడు
చిందులేయు చిత్రాంగుడు

6. ‘పర’ యనియెడి వాద్యమొసగు
కోరినంత పరమ ప్రీతి
అనుచుగోద తెలియజెప్ప
అతివలెల్లసిద్ధమైరి.
ఇంకా ఉంది