Others

భగవత్ ధ్యానం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మార్గశిరమాసం వచ్చేసింది. చలిరాత్రులు, వెనె్నల రాత్రులు వచ్చేశాయి. భగవంతుని సేవలో తరించాలనుకొన్న తల్లి తన చెలులందరినీ , భగవంతునిపైన నమ్మకమున్న అందరినీ పిలవడానికి బయలుదేరింది. నేను ఒక్కతే కాక అందరితో కలసి సామూహికంగా భగవంతుని కైంకర్యం చేసినట్లయితే భగవంతుడు సంతోషిస్తాడని అనుకొంది. ఉన్నది ఒక్కటే దైవం. అందులో తన మన భేదాలు లేవు. నీవు నేను అనే వ్యత్యాసాలు అంతకుముందే లేవు. ఎక్కడ చూసినా భగవంతుని అంశమే. అందరిలో ఉన్న జీవాత్మను తట్టిలేపుతూ పరమాత్మ సమాగమానికి రమ్మని ఆండాళ్ పిలుస్తోంది. దినదిన ప్రవర్థమానమయ్యే సంపదలున్న గోపకులమునందు ఉన్న గోపబాలికామణులారా! యశోదనందుల ప్రియపుత్రుడు, విప్పారినటువంటి నేఅథములతో గాంచెడి యశోదమ్మ సింహకిశోరమై యున్న నీలమేఘచ్ఛాయయైన మేనుతోను, ఎఱ్ఱని తామరలవంటి నేత్రములు కలిగి ప్రియమైన వారికి శీతలమొనర్చు చంద్రుని రీతిగా శత్రుసమూహములకు తీక్ష్ణములైన మార్తాండుని రీతిగా దోచెడి దివ్యమైన ముఖమండలము గలిగినవాడే నారాయణుడు. అతనిని పఱై అనే నామంగల వాద్యాన్ని వాయిస్తూ మనలను అనుగ్రహించుమని వేడెదము రండి. మనలను చూసిన వారంతా ఆనందిస్తారు త్వరగా మేల్కొన గోపబాలుని కీర్తిద్దాం రండి ఆండాళ్ తల్లి పిలుస్తున్నది.

- ఆర్ లక్ష్మణమూర్తి , 7207074899