Others

సూర్య శతకం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తే.గీ. వయసు మళ్లిన వృద్ధుల వ్వారి సేవ
భాగ్యమనియెంచి మసలిన వారుకూడా
గట్టు పుణ్యమ్ము దలుపంగఁ గలమ? చూవె
చూడుమో కర్మసాక్షి! యో సూర్యదేవ!
భావం: వయస్సు మళ్లిన వృద్ధులకు సేవ చేసుకోవడం ఎంతో అదృష్టమని భావించి ఆ ప్రకారంగా నడచుకునే వారు కూడగట్టుకునే పుణ్యం ఆలోచిస్తే ఎంతని చెప్పగలం! వారికి సేవ చేస్తూ వారు చెప్పిన సుద్దులను అనుభవంతో నేర్చుకున్న సారాంశాలని తెలుసుకొని వాటిని జీవితంలో ఆచరిస్తే వచ్చే లాభం ఎంతని కొలవగలం! వృద్ధుల సేవలో అంతా తరించాలని కర్మసాక్షివైన ఓ సూర్యదేవా ఈలోకానికి తెలియుజేయుమయ్యా.
తే.గీ. ఏరి పారేతురే చెత్తనిండ్ల నుండి
మదుల కంటిన మాలిన్యమదియు ఁగూడ
నేరి పారేయఁదలుపంగ నేర్వవలయుఁ
జూడుమో కర్మసాక్షి! యో సూర్యదేవ!
భావం: మన ఇళ్ళల్లో ఉన్న చెత్తాచెదారాన్ని ఏరి పారేస్తారే! మన మనసులకంటిన మాలిన్యాన్ని ఎందుకు ఉపేక్షిస్తారు? మనసునకంటిన ఆ చెత్తను కూడా ఎప్పటికపుడు ఏరి పారేస్తుంటే మనస్సు నిర్మలంగా ఉంటుంది కదా. కానీ అది అంత సులభం కాదు కనుక మనసుమాలిన్యాన్ని ఏరి పారేయడం అనేది సాధన ద్వారా మాత్రమే నేర్చుకోవాలని కర్మసాక్షివైన ఓ సూర్యదేవా ఈలోకానికి ప్రబోధించుస్వామీ!

కొడుకుల సూర్యసుబ్రహ్మణ్యం 9492457262