Others

మార్గళి గీతాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తిరుప్పావై మూలానికి తెలుగు
- ఆసూరి మరింగంటి శేషగిరిచార్య
9886976760
*
1. పాలకడలి, శయనించిన
భగవానుడు తుష్టినొందు;
నియమగతిని మనము వ్రతము
నెమ్మి నమ్మి యొనరించిన

2. శేషతల్పశాయి హరిని
శ్రేష్టముగా స్మరియించుచు;
వ్రతమొనర్చు నియమములను
వ్రేతలకెరిగించె గోద

3. అన్యచింతనమ్ము మాని
కన్నయ్యనె మదిదలుచు,
తెలవారకముందె లేచి
జలకము లాడంగ వలయు

4. కాటుక కైసేతలొద్దు
ముట్టరాదు పాలునేయి;
సిగముడుపులు నిషేధములు
మగువలార! మరయు వినుడి

5 .కూడనిపని చేయరాదు
విడనాడుడి పరనిందలు;
ఆత్మస్తుతులు అసలు వద్దు
ఆడవలదు పరుషోక్తులు

6. పేదలకు సాధువులకు
చేతనైన ద్రవ్యమిచ్చి;
ఆదుకొనుట ధర్మవౌను
అపుడే వ్రత ఫలము దక్కు
ఇంకా ఉంది