Others

మార్గళి గీతాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తిరుప్పావై మూలానికి తెలుగు
*
1. వడుగై వచ్చిన శ్రీహరి
పొడుగై బలిదర్పమణచె
త్రివిక్రముండై సురలకు
త్రిలోకములప్పగించె

2. పరమాత్ముని కీర్తించిన
పడువానలు నెలకుమూడు
పంటలు మెండుగ పండును
పండుగయే ప్రజలకెల్ల

3. సెలయేరులు పొంగిపొరలు
కలహంసలు కూడియాడు;
కలువలు మరి భ్రమరకాలు
కులుకు తటిని మీన తితితొ

4. హర్షించు గోవులెల్ల
క్షీరములిడు సమృద్ధిగ
సుభిక్షమునంది విశ్వము
శోభిల్లును మోదమలర

5. సువ్రతమును చిత్తశుద్ధి
సుదతులిపుడు యొనరించిన
సకల సౌఖ్యప్రాప్తియగును
సర్వశ్రేయ మొడగూడును

6. సౌభాగ్యము కొరకురండి
సహృదయపు సఖియలార!
హరి మనమొఱ లాలకించి
కరుణించును త్వరగరండి
ఇంకా ఉంది

- ఆసూరి మరింగంటి శేషగిరిచార్య 9886976760