Others

మార్గళి గీతాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తిరుప్పావై మూలానికి తెలుగు
- ఆసూరి మరింగంటి శేషగిరిచార్య
9886976760
*
1. నిండు జలధులందునున్న
నీరమ్ముల నెల్లద్రావి,
నీరదములు నింగికెగయ
వరుణదేవ! యాన తిడుము

2. శౌరి చేతి శంఖము వలె
ఉరుముల ధ్వని మించవలెను,
పద్మనాభు చక్రకాంతి
పరిఢవిల్లవలె మెరుపుగ

3. నారాయణు నారి నుండి
శరవర్షము కురియుభంగి
కుంభిని తల్లమెల్ల తడియ
కుంభవృష్టి కలుగవలెను

4. నీలమేఘ శ్యామునివలె
నింగినందు భాసిల్లుచు
కురిపింపుము వర్షమ్మును
కువలయ మానందమొదండ

5. వ్రతకాలమునందు మేము
పరిశుద్ధపు జలస్నానము
ఆచరించి తరియింతుము
అద్భుతముగ మీ కరుణతో.

6. అనుచు గోపకాంతలెల్ల
అరిథంచిరి పర్జన్యుని;
కృపారసము వారలపై
కపారముగ వెదజల్లగ.

ఇంకా ఉంది