Others

సూర్య శతకం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తే.గీ. మనుట ముఖ్యమా? మనిషిగ మనగవలయు
నటుల ఁ గాకున్న నేలకొ యట్టి జీవ
నంబు సారవిహీన వౌ నంత జంతు
జీవనం బేగ నెఱుగుమీ జీవితానఁ
జూడుమో కర్మసాక్షి! యో సూర్యదేవ!

భావం: జీవించడం ముఖ్యం కాదు. మనిషిగా జీవించాలి. అలా మనిషిగా బ్రతుకలేనప్పుడు ఈ జీవనం దేనికి? మనిషిగా బ్రతకని బ్రతుకు సార విహీనమై జంతు జీవనమే అవుతుందన్న సత్యాన్ని కర్మసాక్షివైన ఓ సూర్యదేవా! ఈ లోకానికి తెలియుచేయమయ్యా స్వామీ.
తే.గీ. జ్ఞాన దీపాలు హృదులందుఁ జక్కవెలిగి
వెలుతురుఁ బంచనెంచిన ఁ గలుగు మేలు
లేనిచో ఁ గానక మూల్గుదు వేధరిత్రి ఁ
జూడుమో కర్మసాక్షి ! యో సూర్యదేవ!

భావం: జ్ఞానదీపాలు హృదయాల్లో చక్కగా మెలగాలి. ఆ దీపపు కాంతులు అంతటా ప్రసరింపచేయాలి. అప్పుడే మేలు కలుగుతుంది. అలా కానీ పక్షంలో పెనుచీకటి చుట్టి పారేస్తుంది. అపుడు మిగిలేవి మూల్గులేనన్న సత్యాన్ని కర్మసాక్షివైన ఓసూర్యదేవా! ఈలోకానికి ప్రబోధించు స్వామీ.

కొడుకుల సూర్యసుబ్రహ్మణ్యం 9492457262