Others

నవవిధ భక్తులు నవవిధబంధాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఈ పాశురంలో అద్దాలమేడలో పరిశుద్ధములగు నవవిధ మణులతో వెలిగే దీపముల మధ్య పడుకున్నగోపికను వీరు నిద్రలేపి వ్రతాన్ని చేయడానికి తీసుకుని పోదామనుకొన్నారు. దానికోసం ఒక అమ్మాయి ముందుకు వెళ్లి ఆ పడుకోని ఉన్న అమ్మాయి కన్నా ముందు కనిపించిన ఆ అమ్మాయ యొక్క అమ్మను చూసి
‘ఓ అత్తా! నీ కూతురేమి ఇంకను పడుకోని ఉన్నది. ఇంత పొద్దుపోయేదాక లేకపతోతే ఎంత అనర్థం కలుగుతుంది. దానిని తెలిసిన దానివి నీవే కనుక నీవై లోపలికి నీ కూతురిని లేపుమమ్మా అంటున్నారు ఆండాళ్ తల్లితో వచ్చిన వారంతా. ఇక్కడ మణులు తొమ్మిదివిధాలుగా ఉన్నాయి అని చెబుతున్నారు
అందులోని మర్మం ఏమంటే జీవాత్మకు పరమాత్మకు ఉన్న సంబధాలలో కూడా తొమ్మిది రకాలు ఉన్నాయి. అవి పిత, రక్షకుడు, శేషి, భరత, జ్ఞేయుడు, స్వామి,ఆధారం, ఆత్మ , భోక్త ఈ తొమ్మి ది సంబంధాలతోపరమాత్మను భావంచడమే ప్రజ్ఞ. ఈ ప్రజ్ఞయే మణిమయ భవనం. చుట్టూ దీపమనగా శాస్త్ర పాండిత్యములచే వెలిగే జ్ఞాన దీపం. అగరుధూప పరిమళమనగా జ్ఞానంతో పాటుగా ఆచరణ మనే విజ్ఞానం కూడా తోడైందన్నమాట. ఈ పాశురంలో తిరుమలి శయళ్వారును మేల్కొలుపుతున్నారు.
మామాన్ మకళే అంటే గోదాదేవి లక్ష్మి దేవి తోబుట్టువుగా భావిస్తున్నారు. వీరు ఆళ్వారు తమను చూచి వేదపాఠమును ఆపిన భాగమును నోటితో చెప్పక నల్లని ధాన్యపుగింజను గోటితో గిల్లి కృష్ణానాం వ్రీహీణాం న ఖనిర్భిన్నం అనే మంత్రాన్ని గుర్తు చేస్తున్నారు. గురుపరంపరలో శ్రీమతే రామానుజాయ నమః జ్ఞాతార స్తనయాః అనుట వల్ల ఆండాల్ తల్లి బ్రాతా చేత్ యతిశేఖరః అని భగవద్రామానుజులను అన్నగా భావిస్తున్నట్టు తెలుస్తుంది. ఆ రామా నుజులు చూపిన బాటలో నడుస్తూ ఆండాల్ పాడిన పాశురా లను అనుసంధానించు కుంటూ ఈ మానవ జన్మనెత్తిన మనం మన జీవితాలను సార్థకం చేసుకొందాం. తరలిరండి కృష్ణ భక్తులారా.పరమాత్ముని తిరునామము పరమముగా జపియించుదాం రండి.

- ఆర్ లక్ష్మణమూర్తి , 7207074899