Others

మార్గళి గీతాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తిరుప్పావై మూలానికి తెలుగు
- ఆసూరి మరింగంటి శేషగిరాచార్య
8886976760
*
1. రత్న ఖచిత కుడ్యాలతో
రహిగాంచెడి మేడయందు;
దీపకాంతు లలరుచుండ
ధూపపు గంధాలు నిండె.

2. హంసతూలికా శయ్యన
హాయిగా పవళించునట్టి;
మేనమామ ప్రియనందని
మేలుకొనుము తెలవారెను.

3. మణికాంతుల నీను, ఇంటి
మహద్వార బంధనాన్ని
తొలగించుకొని రమ్మిటు
తోయజాక్షి! త్వరితగతిని

4. అత్తయ్యా! మీరైనా
మత్తువదలి లెమ్మనండి;
బదిరురాల! మూగదియా!
బదులియ్యదు నీకూతురు?

5. ఇంత అతిగ నిదురించగ
మంత్రమేసితిరా? లేక
లేవకుండ కాపలగా
నెరినైన యుంచినార?

6. పరమాత్ముని తిరునామము
పరమముగా జపియించుచు
ఇటకొస్తిమి లేపుమచు
ఇంతులంత వేడినారు

ఇంకా ఉంది