Others

శ్రీయఃపతిని కొలువ రారండి!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బద్ధ్దకంతో పడుకుని ఉన్న గోపికను ఆండాళ్ తల్లి ఇలా పిలుస్తోంది. అ మ్మా సర్వానికి చెందిన ఆ స్వామిని కూడా దాసోహమని అనిపించుకొనెడి సౌభాగ్యమునకు, అదృష్టమునకు నో చుకుని ఉండి ఆయనతో నీవు ఒక్కదానివే స్వర్గానుభవమును పొందు చూచుచుంటివా. ఎంత స్వార్థమమ్మా నీకు. తలుపైనా తీయరాదా? పరిమళాలతో నిండి యున్న తులసీ మాలలను ధరించి ఉన్న స్వామిని నోరు విప్పి కీర్తించినట్లయితే మన కోరిక తీరును.. పరై అనిన దానిని పరమాత్మ మనకు ఒసంగును. గోపికలందరూ ఓ గోపకాంతను నిద్రమేల్కొలుపుతూ అమ్మా మేము రాకముందే నీవు నోము నోచి దాని ఫలముగా సుఖానుభవం పొందినట్లు ఉన్నావు తల్లీ. తలుపు తెరవక పోయిననూ మాటైనా మాటాడరాదా. నీకైమైనా కుంభకర్ణుడు అతని నిద్రను నీకిచ్చి పోయెనా ఏమి? నీవు ఇంతగా నిద్రలో కూరుకుని పోయినావేమి?
అంటే పోయ్‌గై పూదత్తాళ్వారులు జ్ఞాన దీపమును వెలిగించి చీకటిని పోగొట్టగా పేయాళ్వారులు స్వామిని అమ్మను సేవించారు. నోత్తుచ్చువ ర్కం , పుగుగిన్నవమ్మనాయ్ వీరు ఈ విషయానే్న రామానుజ సూత్తం దాది లో 10వ పాశురంలో చెబుతున్నారు. గురు పరంపరలో శ్రీపరాంకుశదాసాయ నమః అనే వాక్యాన్ని అనుసంధానం చేసుకొని మహాపూర్ణులు నో ము నోచవలసిన అవసరం లేకపోయినా అందరి కొరకు నోము నోస్తున్నారు. ఆచారాలను ఆచరించి చూ పితే చిన్నవారు సామాన్యులు కూడా వారి బాటలో నడుస్తారనే ఆశతో వారు చూపారు. కనుక మనమూ వారితో కలసి నారాయణుని సేవిద్దాం రండి. శ్రీయఃపతిని అందరం కొలు ద్దాం రండి అని అమ్మవారు అందరినీ పిలుచుకుని వెళ్తున్నది. మనమూ నేడు అమ్మ పాడిన పాశురాలను అ నుసంధానించుకుంటూ ఆ శ్రీయః పతి వైభవాన్ని ఆస్వాదిస్తూ ఆనందిద్దాం రండి.

- ఆర్ లక్ష్మణమూర్తి, 7207074899