Others

మార్గళి గీతాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తిరుప్పావై మూలానికి తెలుగు
- ఆసూరి మరింగంటి శేషగిరాచార్య
8886976760
*
1. కృష్ణస్వామి యనుభూతితో
తృష్ణమీర సౌఖ్యమొందు
భాగ్యమొచ్చె నంచుమిగుల
పరవశాన యుంటివీవు

2. శ్రీతులీస శుభమాలతొ
శోభిల్లెడి శ్రీకృష్ణుని
‘పర’నాబడు దివ్యమైన
వాద్యమ్మును యర్థింతము

3. శ్రీవ్రతమును సలుపుటకై
శీఘ్రముగా వెళ్దాము రమ్ము;
మన మంగళ గానము విని
‘పర’నొసగును మంగళుండు.

4. కుంభకర్ణుడతి నిద్రను
కుదురుగ నీకొసగినాడ!
ముద్దరాల తెలుపగదే!
మోమాటము పడబోకుము

5. గృహద్వారము దాటి వచ్చి
కృపాకరుని సన్నిధికిక
పద పోదాము రావే సఖి!
పద్మేక్షణ! జాగువలదు

6. మా జతయై నీవొచ్చిన
మాన్యగోష్టి పూర్ణమగుచను
అనుచు చూడికొడుత్తాళు
అయ్యతివకు ప్రబోధించె

ఇంకా ఉంది