Others

సూర్య శతకం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తే.గీ. విలువలెఱుగుచు వర్తింప నిలుచు విలువ
లవియు గుర్తించఁ బోకున్న విలువ లేదు
విలువలవి లేక నిలచిన విలువలేదు
చూడుమో కర్మసాక్షి ! యో సూర్యదేవ!

భావం: ఎదుటివారి విలువలను గుర్తిస్తూ నడచుకోవాలి. అప్పుడే మనకు విలువలాపాదించబడుతాయి. విలువలు గుర్తించని పక్షంలో మన విలువలు అంతరించిపోతాయి. విలువలు లేని జీవితానికి విలువలేదన్న సత్యాన్ని కర్మసాక్షివైన ఓ సూర్యదేవా! ఈ లోకానికి తెలియ జేయుమయ్యా ప్రభూ!
తే.గీ. కేకలను వేయ నరచిన గీములందు
నాగ్రహావేశములు సూపన వియు మదుల
శాంతినిం గూల్చి వేయవా? సరకుగొనరె
చూడుమో కర్మసాక్షి! యో సూర్యదేవా!

భావం: పెద్దగా కేకలేస్తూ అరుస్తూ ఆగ్రహావేశాలు కలిగి యుంటే అవన్నీ మన మనసులలోని శాంతిని గూల్చి వేస్తాయని తెలిసి కూడా వాటిని భూజనులు లెక్కచేయడం లేదు. అరుపులు, కేకలు మరియు ఆగ్రహావేశాలను త్యజించాలని కర్మసాక్షివైన ఓ సూర్యదేవా! ఈ లోకానికి తెలియజేయుమయ్యా ప్రభూ!

కొడుకుల సూర్యసుబ్రహ్మణ్యం 9492457262