Others

దోషనాశిని తిరుమల పుష్కరిణి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మహాభారతంలో పరీక్షిత్ గురించి అందరికీ తెలుసు. ఆయన ఎంతో స్థిర చిత్తంతో నిల్చుని శుకమహర్షి చేత భాగవతం వారంరోజుల పాటు చెప్పించుకుని విని తరించిపోయాడు. బాగుంది.
కానీ పరీక్షిత్తును చంపటానికి తక్షకుడు ఎలా వచ్చాడు. వానిని నిరోధించడానికి కూడా ఒక బ్రాహ్మణుడు వచ్చాడు. మరి ఆ బ్రాహ్మణుడు ఎవరు? అసలు శాపమంత్రానికే మనిషి ప్రాణాన్ని తీసే శక్తి ఉంటే ప్రాణాన్ని నిలబెట్టడానికి చనిపోయిన వారిని బతికించే మంత్రశక్తి కూడా ఉండాలి కదా. పరీక్షిత్ మహారాజు పాలించే కాలంలో ధర్మపాలన చక్కగా జరిగేదికదా. పైన శృంగి తండ్రి శమీకుడు మనం ఆ పరీక్షిత్తువల్లనే ప్రశాంతంగా అడవుల్లో నివసిస్తున్నాం అని అంటాడు.
మరి అట్లాంటపుడు ఎక్కడా అశాంతి లేదు కదా. కానీ ఆ శృంగికి అంత కోపం ఎందుకు? ఆ కోపంలో ఎప్పుడో ఎవరో ఇచ్చిన మంత్రాన్ని జపించడం ఏమిటి? ఆ మంత్రం ఎందుకు ఫలించాలి? ఆ మంత్రాన్ని ఫలించకుండా చేయడానికి ఎవరూ మంత్ర శక్తిని ఉపయోగించనే లేదా అన్న అనుమానం వస్తుంది కదా.
అదిగో ఆ అనుమానాలకే స్కాందపురాణం ఒక కథను చెబుతోంది. పరీక్షిత్ మహారాజు అనుభవించబోతున్న మంత్రాన్ని నేను అనుభవించనివ్వకుండా చేయగలను. ఆశాపానికి విరుగుడు నా దగ్గర మంత్రశక్తి ఉంది అని కాశ్యపుడను బ్రాహ్మణుడు బయలుదేరాడు.
దారిలో తక్షకుడు ఆ బ్రాహ్మణుని సంగతి తెలుసుకొన్నాడు. ఒకవేళ ఆబ్రాహ్మణుడు వేసిన మంత్రంతో రాజును నేనుకాటవేయలేకపోతానేమో అనుకొని అసలు ఆ బ్రాహ్మణుని దగ్గర ఉన్న మంత్రశక్తి ఉందా? తెలుసుకోవాలనుకొని మధ్యలో బ్రాహ్మణునికి ఎదురుపడ్డాడు. మాటల్లో పెట్టి ఆ బ్రాహ్మణుడి ఎక్కడికి ఎందుకు వెళ్తున్నాడో తెలుసుకున్నాడు తక్షకుడు. కానీ ఆ కాశ్యపుని దగ్గర ఉన్న మంత్రశక్తి ఎంతటిదో తెలీయదుకదా అందుకనే ‘సరే నేనే ఆ తక్షకుడిని. నేను ఈ పచ్చని చెట్టునుకాటేసి బూడిద చేస్తాను. నువ్వు తిరిగి ఈ చెట్టును బతికించగలవా?’ అని అడిగాడు.
కాశ్యపుడు సరే నీవు ఈ చెట్టును కాల్చి బూడిద చేయి. నేను తిరిగి బతికిస్తాను అని చెప్పాడు. తక్షకుడు చెట్టును కాటేసి కాల్చేసాడు. కాశ్యపుడు తన మంత్రశక్తితో చెట్టును తిరిగి బతికించాడు. తక్షకుడు ఆశ్చర్యపోయి ‘సరే. నీ మంత్రశక్తి బాగుంది కానీ దేనిని ఆశించి వెళ్తున్నావు’అని అడిగితే నేను దారిద్య్రబాధను అనుభవిస్తున్నాను. దానినిపొగొట్టుకోవచ్చు కదా అని వెళ్తున్నాను అన్నాడా కాశ్యపుడు. వెంటనే తక్షకుడు నీకు కావాల్సినంత ధనం ఇస్తాను.ఆ రాజు ఎంత ఇస్తాడని నీవు అనుకొంటున్నావో దానికి రెట్టింపుధనం నేను ఇస్తాను. కనుక నీవు ఆ రాజు దగ్గరకు వెళ్లక్కర్లేదు. నీవు తిరిగి వెళ్లిపో.. ఆ రాజు అల్పాయుష్కుడు అని చెపుతాడు. ఆ బ్రాహ్మణుడు సరే అని ఆ తక్షకుని దగ్గర ధనం తీసుకొని ఇంటికి వెళ్తాడు. కానీ కాల్చేసి తిరిగి బతికిన చెట్టు పైన ఓ బ్రాహ్మణుడు సమిధల కోసం వచ్చి వీరిని చూసి చెట్టుపైకి ఎక్కి కూర్చుని ఉన్నాడు. అతడు ఆ చెట్టుతోపాటే చనిపోయి తిరిగి చెట్టుతో పాటే బతికిపోయాడు. దానితో తక్షకునికి కాశ్యపునికి జరిగిన సంభాషణ అంతా విన్నాడు.
చివరలో డబ్బుకు ఆశపడి రాజును బతికించకుండా వెళ్లిన బ్రాహ్మణుని గురించి ఆ బ్రాహ్మణుని ఊరిలో చెప్పాడు.
దానితో చెడు చేస్తే ఎంత పాపం వస్తుందో ఆ చెడునుంచి రక్షించగలిగీ రక్షించలేకపోతే కూడా ఆ చెడు చేసిన పాపం వీనికి వస్తుంది అని ఆ ఊరివారంతా ఈ కాశ్యపుని ధనాశకు వెగటు చెంది అందరూ మాట్లాడడం ఆపేశారు. దానితో కాశ్యపుడు ఒంటరివాడు అయిపోయాడు. ఇపుడు ధనం ఉండి బాధపడేవాడు అయ్యాడు.
దానితో చేసిన పనికి వగచి అక్కడే ఉన్న శాకల్యుడనే ముని దగ్గరకు వెళ్లి తన గోడును చెప్పుకున్నాడు. అపుడు ఆ శాకల్యుడనే ముని , నీవు సర్ప విషమునకు విరుగుడు చేయగలిగినా ధన లోభంతో రాజును రక్షించక తిరిగి వచ్చావు. బ్రహ్మహత్య, సురాపానం దొంగతనం గురుద్రోహం చేసినవాడవే అవుతావు. అన్ని పాపాలకు ప్రాయశ్చిత్తము వున్నదిగాని కృతఘు్ననకు ప్రాయశ్చిత్తం లేదు. రోగికి క్షణకాలము జీవితమున్నను చివరవరకు చికిత్స చేయవలసినదే. అట్టు చేయక నీవు పరీక్షిత్తును తక్షకునికి బలిచేసినావు. రాజుని రక్షించలేకపోవడం మ హా పాపం. జనులు అందువలనే నిన్ను దూషిస్తున్నారు అని పలుకగా, కాశ్యపుడు మునికి మ్రొక్కి తరుణోపాయం చెప్పమని ప్రార్ధించాడు. శాకల్యుడు నాయనా, సువర్ణముఖి నదియొడ్డున వెంకటగిరిపై శ్రీనివాసుడు కొలువై వున్నాడు. ఆ స్వామి పుష్కరిణి చాలా మహిమ గలది. నీ పాపము పోవుటకై నీవా పుష్కరిణిలో స్నానం చేసి వెంకటేశ్వరుని దర్శించి భక్తితో సేవించు అని చెప్పాడు. కాశ్యపుడు వెంటనే వెంకటాచలమునకు వెళ్లి స్వామి పుష్కరిణిలో స్నానం చేసి వేంకటేశ్వరుని సేవించి తన పాపం నశింపచేసుకున్నాడు. స్వామి పుష్కరిణిలో ఒక్కసారి స్నానం చేస్తే అశ్వమేధయాగ ఫలితం కలుగుతుంది. స్వామి పుష్కరిణి చూసినా, స్నానం చేసినా, ఆ జలం త్రాగినా మరో జన్మ వుండదని స్కాంద పురాణం చెబుతున్నది. కనుక శ్రీ వేంకటేశ్వరస్వామి దర్శనానికి వెళ్ల్లేవారు మొదట స్వామి పుష్కరిణిలో స్నానం చేసి వరాహమూర్తిని దర్శించి వేంకటేశ్వరుని సేవించడం ఎంతైనా మంచిది.

- డా. జి. సుజాత వెంకట్రావు 8885622196