Others

అక్షర సూరీడు అలిశెట్టి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సాహితీవనంలో
అక్షర 3పూలు2 పూయించినవాడు
అలతి అలతి పదాలతో
అనంత 3్భవాలను2 గుప్పించినవాడు
చిక్క చిక్కని వాక్యాలతో
బతుకు 3చిత్రాలను2 ఆవిష్కరించినవాడు
పదునెక్కిన చురకల శూలాలతో
బూర్జువా భావాల ఎద చీల్చినవాడు
దోపిడీ సమాజంపై
కవిత్వాయుధం ఎక్కుపెట్టినవాడు
నిర్బంధాలు నీడలా వెంటాడినా
నిక్కచ్చితనపు పంథా వీడనివాడు
ఆధిపత్య వర్గం కాపుకాసినా
సాహితీ పతాక ఎగరేసినవాడు
ఆకలి పక్షం నిలిచినవాడు
అభ్యుదయ బాటన నడిచినవాడు
అశ్రుకణంలో అగ్గి రాజేసినవాడు
స్వేదంలో రణం నెగళ్లు రగిలించినవాడు
అతడే అక్షరయోధుడు, అలిశెట్టి ప్రభాకరుడు
బతికింది కొద్దిదినాలే అయినా
అనంతకాలపు స్ఫూర్తి చిహ్నం
రాల్చినవి గుప్పెడే అయినా
విశ్వపరివ్యాప్తమైన అక్షర పరీమళం
వేశ్య చీకటి బతుకుల చెక్కిన అక్షర శిల్పి
మరణం నా చివరి చరణం కాదంటూ
ఆఖరి క్షణందాకా
సమానతను స్వప్నిస్తూ
అభ్యుదయాన్ని ఆకాంక్షిస్తూ
అక్షర సూరీడై వెలిగే అలిశెట్టి
గళం గళం నీ పదాల పల్లవిస్తోంది
జాతి జాతి నీకు
అక్షర ప్రణామాలు అందిస్తోంది.

- కోడిగూటి తిరుపతి 957329493