Others

సూర్య శతకం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తే.గీ ప్రాకులాడంగరాదెట్టి పదవులకునుఁ
జక్కనౌ సేవఁజేయంగ సంబరపడ
వలయు నిస్వార్థబుద్ధియుం బడసి భువిన
వెల్గుచును వెల్గుఁబంచంగ వెడలవలయుఁ
జూడుమో కర్మసాక్షి! యో సూర్యదేవా!

భావం: ఎలాంటి పదవులకు ప్రాకులాడరాదు. చక్కనైన సేవ చేయడానికి ఎంతగానో ఆనందించాలి. నిస్వార్థబుద్ధితో ప్రకాశిస్తూ వెల్గులు పంచడానికి అంతా వెడలవలెనని కర్మసాక్షివైన ఓ సూర్యదేవా! ఈలోకానికి ప్రబోధించు స్వామీ!
తే.గీ పదవియుండును పోవును పదవిగాదు
పేరుఁ బడసినఁ బోయినఁ బేరు మిగిలి
పోవుఁ జరితలోఁ జాలదా? పుడమితల్లి
పొంగిపోవును ధన్యవౌ పుట్టుకపుడు
చూడుమో కర్మసాక్షి! యో సూర్యదేవ!
భావం: పదవి అనేది ఇవాళ ఉంటుంది, రేపు పోతుంది. పదవి కాదు పొందాల్సినది మంచిపేరు. మనం పోయినా ఆ మంచి పేరు చరిత్రలో సుస్థిరంగా నిలిచిపోతుంది. అది చూసి మాతలకు మాత అయిన భూమాత ఎంతగానో పొంగిపోతుంది. అప్పుడే పుట్టుక ధన్యమవుతుందని కర్మసాక్షివైన ఓ సూర్యదేవా! ఈ లోకానికి ప్రబోధించు ప్రభూ!

కొడుకుల సూర్యసుబ్రహ్మణ్యం 9492457262