Others

మార్గళి గీతాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తిరుప్పావై మూలానికి తెలుగు
*
- ఆసూరి మరింగంటి శేషగిరాచార్య
8886976760
*
1. బహువర్షము కలుగునెడల
బయటకు రాలేని స్థితిన,
కొండగుహ నొదుల లేక
పండు నందె సింహరాజు

2. అదనుజూచి యొడలి జూలు
విదిలించుచు విస్తరించి,
ఒడుపుగా నడుగులేస్తూ
ఒంటరిగనె బయటికొచ్చు.

3. అతసీనుమ వర్ణరూప!
అచ్యుతా! అనంత! కృష్ణ!
అగుపించుము యట్టులనే
అందపు నీ మేడ వీడి.

4. శ్రేష్ఠమైన లోకోత్తర
సింహాసనమధిష్ఠించి;
మా కోర్కెలు దీర్పరండి
మా రాకకు హేతువరసి

5. మురహరా! మిమ్ము జూడ
ముదితలెల్ల యరుదెంచిరి,
కొదమ సింగమైన నిన్ను
కొలిచెదమిట కూర్మి పేర్మి

6. అనుచు గోద వెంటనున్న
అనుగు సఖుల కోర్కెమేర;
తమ రాకకు గల హేతువు
నిమ్మళముగ దెలిపె వేడ్క

- ఇంకాఉంది -