Others

సూర్య శతకం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తే.గీ కామక్రోధాది రిపులనుఁ గాలరాసి
యింద్రియమ్ములను జయించి యెదిగినంత
బ్రహ్మ రథమును ఁ బడుదురీ వసుధలోనఁ
జూడుమో కర్మసాక్షి! యో సూర్యదేవ!

భావం: కామక్రోధలోభ మోహమద మాత్సర్యాలనే అంతశ్శత్రువులను అంతంచేసే ఇంద్రియాలను జయించి మహానుభావులుగా యెదిగినపుడు ఈ భూమండలమందలి జనులంతా బ్రహ్మరథాన్ని పడతారన్న సత్యాన్ని కర్మసాక్షివైన ఓ సూర్యదేవా! ఈలోకానికి ప్రబోధించవయ్య స్వామి.

తే.గీ. ఇతరులకుఁ బెట్టఁ బ్రాణంబులెగసిపోవు
ననియుఁ దలచెడి వెడగుల నడతఁగాంచి
యేడ్వలేకను నవ్వుదురిల జనాళి
చూడుమో కర్మసాక్షి ! యో సూర్యదేవ!

భావం: ఇతరులకు (అన్నార్తులకు) కొద్దిగా పెట్టాలంటేనే ప్రాణాలు పోతాయని భావించే అవివేకుల ప్రవర్తనా పద్ధతులను జూసి జనులంతా ఏడవ లేక నవ్వుతారన్న సత్యాన్ని కర్మసాక్షివైన ఓ సూర్యదేవా! దీనులను సేవిస్తే దామోదరుడిని సేవించినట్లే అవుతుందన్న సత్యాన్ని కూడా ఈ అమాయకులకు తెలియజెప్పుమా ప్రభూ! ప్రభాకరా!

కొడుకుల సూర్యసుబ్రహ్మణ్యం 9492457262