Others

జ్ఞాన నేత్రం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఓ అజ్ఞాన రాశీభూతమా!
ఓ ఆలోచనా తత్పరా...
నీవు సౌందర్యారాధకుడవని భ్రమిస్తున్నావా...
ధవళకాంతివనవిహారం
చేయాలనేది నీది ఉత్సుకతా...
నీ ఎదరొదలో వేదనా గాథలా...
చిమ్మచీకట్లా.... మధురగీతులా..
ఏవి ఎందున్నాయ...?
నీలో ఉన్నధి నిశాంధకార నిర్నీతి
నీలో అస్కన్నము కావాలి తేజోరాశి
నికనైన వదిలించు మలిన ఆలోచనా పరంపర
ఉంకించు నిక శే్వతాంబరవీధిన
మలినభాష్పాల నొప్పారలేదెన్నడీ జగతి
శే్వతాంబరవినువీధిలో తెలివేకువ పడతి
ఆలపించే సుమధుర గీతిలోగడిపేను
ఈ జగమెల్లప్పుడును
నెనరున్యాయం వీడి
అర్థం పర్థంలేని పదాలపోహళింపుతో
కవిత్వమనే కలికితురాయని
మసిబారనీయకు
చెలిమికి అర్థం తెలియని మూర్ఖశిఖామణీ
తళుకుబెళుకులనతికించి
మ్రోడుమ్రాకుల వెలగించి మురసిపోవ
నీదు ఆలోచనసరళి ఈవిధంగానై నున్నట్టి వేళ
ఏ సజ్జనునినీ కాంచలేవు.....
నీచిత్త శాంతికై పలికించు
నీనోట భగవానుని నామగీతి
ఇదియే నీకు ఆత్మశాంతి
ఇంకానా ఇకపై సాగదు నీ భ్రాంతచిత్తము
కట్టిపడవేయ మనసును
అపుడన్నా
నీలో కురుస్తున్న కృత్రిమ రుధిర ధారలకు
దరి కాలేదు ఏ బుద్ధిజీవి!
భ్రమరమై భ్రమరగీతలు
ఆలపించ ఉద్యుక్తుడవైతే
నీదు వైదుష్యం చూచి
నలుగురు మెచ్చవచ్చు
కాని నీలోని స్వార్థం
నినే్న వెక్కిరిస్తుందోయ వెర్రినాగన్న....
మనసు చెప్పింది విను.......
మర్మంలేకుండా మాట్లాడు
స్వార్థుడై ప్రేమ అనే చెకుముకి రాయ ని ధరించి
ప్రకృతిని చెక్కుతానంటే
అభాసుపాలు కాకతప్పదు మిత్రమా
ఇప్పటికైనా మేల్కొలుపు నీ జ్ఞాననేత్రం

- ప్రసన్నాంజలి