Others

స్నేహ హస్తం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అతిశీతోష్ణాలు చుట్టుముట్టడంతో
ఘనీభవించిన నా మానసం
నీ నవ్వుల పువ్వుల మాటలతో
కరిగి నీరయ కళ్లలోంచి ఉబికింది..

జడత్వంలోంచి చైతన్యంలోకి
సుషుప్తిలోంచి మెలుకువ లోకి
నెమ్మదిగా అడుగులు వేస్తున్నా..

నీ మాటల స్పర్శానుభూతితో
నీ ఆత్మీయానురాగ రవళిలో

కాలం జవనాశ్వమై పరుగిడుతుంటే
కలల్లో కాలం వెళ్లబుచ్చుతున్న నేను

ఇపుడిపుడే కళ్లు విప్పారుస్తున్నా
నిదురించిన జ్ఞాపకాలు ఎదలోతుల్ని తడిచేస్తుంటే

కాలం వెనుక్కు తిరుగుతుంటే
సందేహాల సంకెళ్లు చుట్టుముట్టుతుంటే

నీవు కురిపించే స్నేహమనే ప్రేమజల్లు
వసంతాగమనానికి ఆహ్వానం పలుకుతోంది
నీ చెలిమి కలిమి నాలో బలాన్నినింపుతోంది
ఆ కలిమి బలిమి తో
నా ఎద చైతన్యం నింపుకుని రెక్కలు చాస్తుంటే
విశాల విశ్వమే నన్ను రారమ్మని పిలుస్తోందనిపిస్తోంది

నేస్తమనే మేఘమొక్కటి
నాపై నమ్మకాల జల్లు కురుపిస్తుంటే

ఎదలోని
భావాలెన్నో సరికొత్తరాగం ఆలపిస్తున్నాయ
పదాలన్నీ జిలుగువెలుగులెన్నో సంతరించుకుంటున్నాయ
పరిచయమే లేని కొత్త పదాలు చేరువవౌతున్నాయ
ఆలోచనలు నవనవోనే్మషమై
కొత్త బాటలెన్నింటినో నేస్తున్నాయ
ఇక నేవెనకడుగు వేయక
ముందుకు సాగిపోతా నేస్తమా!
నీ స్నేహమనే దీపపుకాంతి దేదీప్యమై వెలుగుగాక చిరకాలం!

- డా. రాయసం లక్ష్మి