Others

ఆత్మవిదుడు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

‘ఆత్మవిదుడు’ అన్న గీతా పారిభాషిక పదానికి అర్థం ఆత్మజ్ఞాని అని పామరభాషలో చెప్పుకోవచ్చు. ఆత్మను తెలుసుకోవడం ఎలా? అన్న ప్రశ్నకు సమాధానం చెప్పటం అంత తేలిక కాదు. అందుకు ముందుగా ఆత్మను గురించి తెలుసుకోవటం అవసరం. ‘నేతి నేతి’ అన్న సూత్రప్రకారం, కానివన్నీ తొలగించాక మిగిలేది ఆత్మ ఒక్కటే! మిగతావన్నీ అనాత్మ వస్తువులు. శరీరం, ఇంద్రియాలు మొదలైనవి నశించే గుణం కలవి. ఆత్మ మాత్రం అవినాశి. ఎండా వానలకు, చలికి గాలికి, లొంగకుండా, మండగలిగితే ఆత్మ విద్యలో తొలి మెట్టు ఎక్కినట్టే అనుకోవచ్చు. శరీరం, మనస్సు, ఆత్మ ఈ మూడింటికి లంకె వున్నది. శరీరానికి నొప్పి కలిగితే మనస్సు బాధపడుతుంది. మనస్సు బాధపడితే దాని నీడ ఆత్మను ఆవరిస్తుంది. మల, విక్షేప, ఆవరణలు అన మూడు పొరలు తొలగితే ఆత్మ ప్రసన్నమవుతుంది.
సాధారణంగా ‘నేను’ అన్న పదం అందరికీ తెలుసు. ఆ తర్వాత ‘నేనేమిటి?’ అన్న మరో ప్రశ్న ఎదురవుతుంది. ఆ నేను ఆత్మ అనుకోవటానికి వీలులేదు. ఆత్మ అంటే అహం, స్వయం, స్వ అనే అర్థాలు వున్నాయి. ఉపనిషత్తులు, పురాణాలు, ఇహాసాలు ఈ ప్రశ్నకు రకరకాల సమాధానాలు, వ్యాఖ్యలు చేస్తున్నాయి. అన్ని లౌకిక వ్యవహారాలలో ఈ నేను అన్నది ముఖ్యపాత్రను పోషిస్తున్నది. నిత్య జీవితంలో వాడుకలో వున్న ఈ పదాన్ని బాగా విశే్లషించుకోవాలి. నిరంతరం దైవనామాన్ని జపించేవారు కూడ, నిజ నిర్థారణ చేసుకోలేలేక నిరాశ, నిస్పృహలకు గురి అవుతున్నారు. నేను అని మనం దేన్ని గుర్తిస్తున్నాం? శరీరాన్నా? శరీరంలోని భాగాలనా? ఈ చెయ్యి ఈ కాలు ఇవన్నీ నావి; వెరసి నేను అన్న భావన మనలో పాతుకుపోయింది. ఈ అంగాలకు రూపు రేఖా విలాసాలతోపాటు రకరకాల కార్యకలాపాలున్నాయి. అంచేత, నాది అనుకుంటున్న ఏది ఒక్కటి నీవు (నేను) కాదు. వెరసి అన్నీ ఐకమత్యంతో వ్యవహరించినప్పుడే నేను అర్థవంతం అవుతుంది. అంటే, భిన్న భిన్న ఆకృతులలో వున్న ఈ నేను అఖండమై వున్నా మనకు అనుభూతం కావటం లేదన్నమాట. సప్త్ధాతువులు, 72 వేల నాడీ కేంద్రాలు శరీరంలోనే వున్నప్పటికీ, పరస్పర వైరుధ్యంకల కార్యకలాపాలు జరుగుతూ వున్నాయి. అవి నేను కానంటున్నవి. సప్త్ధాతువులు, ఐదు కర్మేంద్రియాలు, ఐదు జ్ఞానేంద్రియాలు, మనవే అయినా కార్యకారణ భేదంవల్ల నేను అనుకోవటానికి వీలు లేదు. ఇది నా చెవి అనవచ్చు కాని, నేను చెవిని అని చెప్పటం సమంజసం కాదు కదా? అలాగే పంచ ప్రాణాలు, నాలుగు స్థితులు, మూడు పరిస్థితులు మారుతూనే వుంటాయి. ప్రాణ, అపాన, వ్యాన, ఉదాన, సమాన వాయువులు; బాల్య, కౌమార, యవ్వన, వృద్ధ దశలు, దేశ, కాల, పాత్రలు, మార్పు చెందటం సహజం. కాని ఆ నేను మాత్రం తన అస్థిత్వం కోల్పోకుండా అన్నింటా అంతర్లీనమై వుంటుంది. మనోబుద్ధి చిత్త అహంకారాల సంగతి అంతే! ఇలాంటి మానసిక విక్షేపంవల్ల జ్ఞాని కూడా రాగద్వేషాలకు లోను కాక తప్పదు. అవిభాజ్యంగా అన్ని విభాజక పదార్థతత్త్వాలలో నేనున్నదన్న విషయం తెలుసుగాని, మన అనుభవంలోనికి రాలేదు. అన్నింట సమదృష్టి కలిగి యోగ యుక్తుడైనవాడు సర్వభూతాలలో తనను, తనలో అన్నింటిని చూడగలడు- అంటున్నది గీతామాత. అఖండమై, సర్వవ్యాపిగా, అన్నింటికి ఆదిమూలమైనది; అస్తిత్వం కలది; విడదీయటానికి వీలులేనిది; మాయాతీతమైనది; అన్నింటిని కలుపుకుని, అంతటికి ఆధారమైనది అసలైన నేను. అదే అహం, ఆత్మ, స్వ, స్వయం, వాక్కు, మనస్సు, రూపం, నామం- వీటి అతీతంగా శబ్దం, మనస్సు అదిగమించినప్పుడే నేను ఏమిటో అవగతం అవుతుంది. జ్ఞానంలో నేనేమిటో తెలుసుకున్నవాడే ఆత్మవిదుడు.

-నిరామయ 8142888461