Others

దృష్టి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పాత పుస్తకం చుట్టూ
దోమ చెక్కర్లు కొడుతుంది
దానిలో రక్తమాంసాలు
ఇంకా తాజాగానే ఉన్నాయి

ప్రాచీన గాథలన్నీ
నిశ్శబ్దంగానే వుంటాయి
కాలం మింగేసినవి పోగా
ఇప్పటికీ శబ్దిస్తున్నాయి.
సాలార్‌జంగ్ మ్యూజియంలో
ఆ కవచాన్ని
చిన్నప్పటి నుంచీ చూస్తున్నాను
వింటే దాని ఛాతీలోంచి
యుద్ధాలు వినిపిస్తాయి.

తూనీగ ఒకటి
తల చుట్టూ పరిభ్రమిస్తోంది
దాని కళ్లలో
కొండలు ప్రలిస్తున్నాయి
పొలాల్లో ఇప్పుడు
కలుపు పాటలు లేవు
ఒకప్పుడు మొక్కలు కూడా
వాటిని వినేవి
పచ్చదనం
ఆ అనుభూతుల పుణ్యమే

మా ఊరి దగ్గర
కాస్సేపు ఆగాలని వుంది
దాని చుట్టూ
జ్ఞాపకాలు ముసురుతున్నాయి
కాని
మనం ఉల్లాసంగా లేనప్పుడు
పువ్వుల పరిమళం వ్యర్థవౌతుంది.
*

-డా.ఎన్.గోపి