Others

ఫైనల్ టచ్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సందీప్ వంగా -డార్లింగ్ ప్రభాస్ కాంబో ప్రాజెక్టు ఫినిషింగ్ టచ్‌లో ఉందన్న మాట వినిపిస్తోంది. సందీప్ డిజైన్ చేసిన ఫైనల్ స్క్రిప్ట్‌ను హీరో ఓకే చేస్తే -ప్రభ 22వ ప్రాజెక్టుకు అఫీషియల్ అనౌన్స్‌మెంట్ రావొచ్చన్న మాట వినిపిస్తోంది. ప్రస్తుతం ప్రభాస్ -ప్రాజెక్టు 20తో బిజీగా ఉన్నాడు. రెండురోజుల క్రితం వరకూ జార్జియా షూటింగ్ షెడ్యూల్ కంప్లీట్ చేసుకుని హోంల్యాండ్‌కు చేరినట్టు తెలుస్తోంది. డైరెక్టర్ రాధాకృష్ణ తెరకెక్కిస్తోన్న ఈ పీరియాడికల్ థ్రిల్లర్‌కు -ఓ డియర్, రాధేశ్యామ్ టైటిల్స్ పరిశీలిస్తోన్న విషయం తెలిసిందే. దీని తరువాత ప్రభాస్ -నాగ్ అశ్విన్‌తో సెట్స్‌పైకి వెళ్లనున్నాడు. పాన్ ఇండియా హీరో కోసం ‘సూపర్ హీరో’ క్యారెక్టరైజేషన్‌తో అశ్విన్ డిజైన్ చేసిన స్టోరీకి ప్రభాస్ ఓకే చెప్పడంతో -వైజయంతీ మూవీస్ బ్యానర్‌పై ప్రాజెక్టు తెరకెక్కుతున్నట్టు అధికారిక ప్రకటన సైతం వచ్చేసింది. ప్రభ 21వ ప్రాజెక్టు విషయంలోనే అనేక టాప్ డైరెక్టర్ల పేర్లు వినిపించినా -అశ్విన్ ఆ చాన్స్ అందుకోవడంతో.. 22వ ప్రాజెక్టు ఎవరికి? అన్న కథనాలు మొదలయ్యాయి. అర్జున్‌రెడ్డి డైరెక్టర్ సందీప్, కేజీఎఫ్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ పేర్లు వినిపిస్తున్నాయి. అయితే, సందీప్ చెప్పిన లైన్‌కు ప్రభాస్ ఇంప్రెస్ అవ్వడంతో -్ఫల్‌స్క్రిప్ట్‌ను డిజైన్ చేసే పనిలో సందీప్ ఉన్నట్టు సమాచారం. త్వరలోనే నెరేషన్‌కు ఫైనల్ టచ్ ఇచ్చేసి ఓకే చేయించుకునే పనిలో ఉన్నట్టు తెలుస్తోంది. జేమ్స్‌బాండ్ తరహాలో ‘ఎరాటిక్ హీరోయిజం’ క్యారెక్టర్‌తో కంటెంట్‌ను డిజైన్ చేస్తున్నారన్న మాటా వినిపిస్తోంది. ఇదే డెవిల్ ప్రాజెక్టా? అన్న సందేహాలూ లేకపోలేదు.