అర్చన

సర్వ శుభప్రదం.. గాయత్రీ మహామంత్రం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఓం భూర్భువస్సువః తత్‌సవితుర్వరేణ్యమ్
భర్గో దేవస్య ధీమహీ ధియో యో నః ప్రచోదయాత్
ఇదే శ్రీ గాయత్రి మహామూలమంత్రం. ఈ మంత్రాన్ని నిత్యం స్ర్తి పురుష భేదం లేకుండా ఎవరైనా జపించవచ్చు. ఈ మంత్రోచ్చారణవల్ల సకల కోరికలు ఫలిస్తాయి. గాయత్రి దేవి ఎంతో దయామయ. ఆమె సర్వ జగాలకు తల్లి. అర్క మండల తార్గత చైతన్యాభిన్న బ్రహ్మవస్తువే ఆ దైవతమనీ, అంతర్మధ్యాహ్న, సాయంకాల సమయాలలో ఆ దేవతయే గాయత్రీ, సావిత్రీ, సరస్వతి అనే విశేష నామాలతో ఆయా సంధ్యాకాలాలలో ప్రకటితమయ్యే సూర్యభగవానుని కిరణాల రక్తశే్వతాదివర్ణాలను అనుసరించి ప్రాతః, సంధ్యా సమయాలలో క్రమంగా ఆమే రక్తవర్ణంతో, శే్వతవర్ణంతో, నీలవర్ణంతో ఉపాశ్యమానమవుతోన్న దేవతే శ్రీగాయత్రీదేవి.
శ్రీగాయత్రీ మాత మంత్రసాధన చేయటంవల్ల మోక్షం లభిస్తుంది. గాయత్రీ దేవి తనను ఉపాసించిన వారికి ధర్మజ్ఞానాలను కలుగజేసి, వారికి ఆయువు, ఆరోగ్యం, యశస్సులను పుష్కలంగా అందిస్తుంది. గాయత్రి అంటే ధ్యానించువారిని రక్షించునది అని అర్థం. మనిషికి ఉండే సమస్యలు, ఈతిబాధలు, కష్టాలు కన్నీళ్ళు, దుఃఖం ఇలాంటివన్నీ గాయత్రి మంత్ర జపంవల్ల దూరమవుతాయి. గాయత్రీ మంత్రం ఉపాసిస్తే మనిషి మనసులో ఉన్న మలినాలు చెడు మొత్తం సమసిపోతుంది. గాయత్రీ ధ్యానం అంటే ఆత్మయొక్క జ్ఞానమే అని సంధ్యావందనంలోని గాయత్రీ మంత్రార్థం మనకు చెబుతుంది. ప్రతి మనిషి త్రికరణశుద్ధిగా సూర్యోదయానికి ముందు బ్రాహ్మీముహూర్తకాలంలోనూ, సూర్యాస్తమయకాలంలోనూ సూర్యనారాయణమూర్తికి ఎదురుగా నిలుచుని, ఆయనను, ‘స్వామీ నాకు మంచి బుద్ధినీ, జ్ఞానాన్ని ప్రసాదించు’ అని ప్రార్థించి, ఆ సూర్య తేజస్సును ధ్యానించటమే సంధ్యోపాసన, లేక గాయత్రీ ఉపాసన అని చెప్పాలి. ఈ గాయత్రీ ఉపాసన సర్వవేదాల సారభూతమైనదిగా చెప్పబడింది. ఈ గాయత్రీ ధ్యానంవల్ల మోక్షం సాధిస్తుంది. గాయత్రీ జపం, ధ్యానం ఎంతో మహత్తరమైనది. ఎలాంటి పాపాలు చేసినవారినైనా హరింపజేయగల శ్రీమాత, ప్రతి ఒక్కరినీ క్షమిస్తుంది. గాయత్రిని మించిన పాపాలను నశింపజేసే మంత్రం మరోటి లేదని చెప్పవచ్చు.
ఎవరైతే విధి పూర్వకంగా గాయత్రీ మాతను కొలుస్తారో, అటువంటివారికి గాయత్రీ మాత సర్వశుభాలను కలుగజేస్తుంది. గాయత్రీ మంత్రం సర్వవేదాలసారం, సప్తకోటి మహామంత్రాలసారం. గాయత్రీధ్యానం వల్ల ఇష్టకార్య ఫలసిద్ధి కలుగుతుంది. సమస్త పాపాలనుండి విముక్తులై చింతలు, శోకం, వ్యాధులు, దారిద్య్రం వంటివాటినుండి విముక్తి లభిస్తుంది. నిత్యం ‘ఓం నమో గాయత్రీ మాత్రే’ అన్న మాటను అదే పనిగా జపించటంవల్ల ఎంతో ప్రశాంతత లభించి మంచి జరుగుతుంది.

- మనస్వని