మెదక్

ప్రజా సేవతోనే సార్థకత

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పటన్‌చెరు, జనవరి 21: ప్రజలకు సేవ చేయడంతోనే రాజకీయ నాయకుల జీవితాలకు సార్థకత లభిస్తుందని పటన్‌చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్‌రెడ్డి అన్నారు. ప్రజాప్రతినిధులు అయ్యే అవకాశం కొద్ది మందికే లభిస్తుందని, దానిని సద్వినియోగం చేసుకోవాలని పిలుపునిచ్చారు. పటన్‌చెరు, రామచంద్రాపురం, భారతినగర్ మూడు డివిజన్లకు గాను అధికార టిఆర్‌ఎస్ అభ్యర్థులుగా ఎంపికైన రాజబోయిన కుమార్‌యాదవ్, తొంటఅంజయ్య, సింధుఆదర్శరెడ్డిలకు ఆయన గురువారం తన నివాసంలో మెదక్ ఎమ్మెల్సీ భూపాల్‌రెడ్డితో కలిసి పార్టీ బి ఫారాలు అందచేసారు. అనంతరము మాట్లాడుతూ జిఎచ్‌ఎంసి ఎన్నికలలో విజయం సాధించిన తరువాత ప్రజా సేవకే అంకితం కావాలని సూచించారు. గ్రేటర్ హైద్రాబాద్ మహానగరాన్ని విశ్వనగరంగా మార్చడంలో తమ వంతు పాత్ర పోషించాలన్నారు. ఎన్నికల బరిలో నిలిచిన ప్రతిపక్షాల అభ్యర్థులు, ఆయా పార్టీల నాయకులు అధికార టిఆర్‌ఎస్ పాలనపై జరుపుతున్న అసత్య ప్రచారాన్ని తిప్పికొట్టాలని పిలుపునిచ్చారు. అధికార పార్టీ టిఆర్‌ఎస్‌కు ఓటేయడం ద్వార నగర ప్రజలు మరింత అభ్యున్నతిని కోరుకోవాలని మెదక్ ఎమ్మెల్సీ భూపాల్‌డ్డి సూచించారు. మూడు డివిజన్లలో పార్టీ అభ్యర్థులు ఈ మేరకు ఎన్నికల ప్రచారాన్ని ఉధృతం చేయాలని పిలుపునిచ్చారు. ఇంకా ఈ కార్యక్రమంలో పటన్‌చెరు మండల పరిషత్ అధ్యక్షుడు గొల్ల శ్రీశైలంయాదవ్, టిఆర్‌ఎస్ నాయకులు ఆదర్శరెడ్డి, పరమేష్‌యాదవ్ తదితరులు పాల్గొన్నారు.