మెదక్

పిహెచ్‌సిల మెరుగుకు మూడు కమిటీలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సంగారెడ్డి కలెక్టరేట్, జనవరి 21: జిల్లాలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల ద్వారా మెరుగైన సేవలు అందించేందుకు ప్రణాళికలు రూపొందించాలని కలెక్టర్ రొనాల్డ్‌రాస్ సంబంధిత అధికారులను ఆదేశించారు. గురువారం కలెక్టరేట్‌లోని మినీ సమావేశ మందిరంలో వైద్య, ఆరోగ్య శాఖ అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రభుత్వ ఆసుపత్రులకు వచ్చే రోగులకు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు ప్రతి ప్రాథమిక ఆరోగ్య కేంద్ర వైద్యాధికారి తీసుకోవాల్సిన చర్యలను వివరించారు. ప్రస్తుతం అందిస్తున్న సేవలను మరింత మెరుగుపర్చేందుకు అవసరమైన ప్రణాళికలు రూపొందించేందుకు మూడు కమిటీలను సంబంధిత వైద్యాధికారులతో ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఒక్కో కమిటీలో ఐదుగురు వైద్యాధికారులు ఉంటారన్నారు. మొదటి కమిటి రోగులకు మెరుగైన సేవలు, వారి సమాచారాన్ని నిక్షిప్తం చేసే విధంగా రూపొందించాలన్నారు.
రెండవ కమిటీ మాత శిశు సంరక్షణకు తీసుకోవాల్సిన చర్యలు, రెఫరల్ మెకానిజం మెరుగుపర్చేందుకు ప్రణాళికలు సిద్ధం చేయాలన్నారు. మూడవ కమిటి అన్ని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలలో వౌళిక సదుపాయాలు, రోగులు, వారి సహయకులకు అవసరమైన అన్ని చర్యలు, పిహెచ్‌సి కేంద్రాల పరిశుభ్రత, ఆహ్లాదకరమైన వాతావరణం ఏర్పాట్ల వంటి వాటిపై ప్రణాళికలు రూపొందించాలన్నారు. రూపొందించిన ప్రణాళికల ఆధారంగా మెరుగైన వైద్య సేవల కోసం తగు చర్యలు తీసుకోవాలని సూచించారు. కమిటీలు తమ ప్రతిపాదనలను అసిస్టెంట్ కలెక్టర్ కృష్ణ ఆదిత్య, జిల్లా పరిషత్ సిఈఓ వర్షిణిలతో చర్చించి తుది రూపు ఇవ్వాలన్నారు. సమావేశంలో డిఎంఅండ్‌హెచ్‌ఓ అమర్‌సింగ్ , ఎన్‌హెచ్‌ఎం డిపిఓ జగన్నాథ్‌రెడ్డి, డిఓఓ సునిల్, పిహెచ్‌సి వైద్యులు పాల్గొన్నారు.