హైదరాబాద్

ప్రజాసంక్షేమమే ప్రభుత్వ ధ్యేయం: తలసాని ప్రచారం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బేగంపేట, జనవరి 22: టిఆర్‌ఎస్ ప్రభుత్వం ప్రజా సంక్షేమం కోసం కృషి చేస్తున్నట్లు రాష్ట్ర మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. గ్రేటర్ ఎన్నికల ప్రచారంలో భాగంగా బేగంపేట డివిజన్ టిఆర్‌ఎస్ అభ్యర్ధి తరుణి గెలుపుకోసం ఆయన శ్యామ్‌లాల్, తాతాచారినగర్, ఎరుకలబస్తీ, పోచమ్మబస్తీ, భగత్‌సింగ్‌నగర్, గురుమూర్తినగర్ ప్రాంతాల్లో ప్రచారం చేసారు. పేదలకు డబుల్‌బెడ్‌రూం ఇళ్లను కట్టించడానికి ప్రభుత్వం కృత నిశ్చయంతో ఉందని అన్నారు. అర్హులకందరికీ డబుల్‌బెడ్‌రూం ఇళ్లను కట్టించి ఇస్తామని ఆయన హామీ ఇచ్చారు. ఇప్పటివరకు వున్న వాటర్, కరెంటు బకాయిలు ఎవరూ కట్టవద్దని ప్రభుత్వం మాఫీ చేసిందన్నారు. కలుషిత జలాలపై అధికారులు స్పందించి చర్యలు చేపడతారని అన్నారు. జి+1 బిల్డింగ్‌లపై జిహెచ్‌ఎంసి అధికారులు వత్తిడి చేస్తున్న సంగతి మంత్రి దృష్టికి తేగా, టౌన్‌ప్లానింగ్ అధికారులతో మాట్లాడతానని హామీ ఇచ్చారు. డివిజన్ ఇన్‌చార్జ్ రేఖనాయక్, కంటోనె్మంట్ బోర్డు వైస్ చైర్మన్ కేశవరెడ్డి, టిఆర్‌ఎస్ నేతలు నరేందర్‌నాయి, అక్బర్, శ్రీనివాస్ పాల్గొనగా ఈ సందర్భంగా పలువురు మహిళలు మంత్రి సమక్షంలో టిఆర్‌ఎస్‌లో చేరారు.
రామ్‌గోపాల్‌పేట డివిజన్‌లో..
డివిజన్ టిఆర్‌ఎస్ అభ్యర్ధి అరుణగౌడ్ ముమ్మర ప్రచారం చేసారు. కృష్ణనగర్, సింధికాలనీ, కుర్మ బస్తీలో మంత్రి తలసాని ప్రచారంలో పాల్గొన్నారు. అన్ని వర్గాలకు న్యాయం జరగాలంటే అరుణగౌడ్‌ను గెలిపించాలని కోరారు. ప్రచారంలో శ్రీనివాస్‌గౌడ్, మల్లికార్జునగౌడ్, మునిర్‌రాజు, జనార్ధన్ పాల్గొన్నారు.
బిజెపి అభ్యర్ధి ప్రియాంకవర్మ డివిజన్‌లోని మహంకాళిస్ట్రీట్, జనరల్‌బజార్ తదితర ప్రాంతాల్లో ఇంటింటి ప్రచారంలో పాల్గొని బిజెపికి ఓటు వేయాలని కోరారు. పార్టీ నేతలు భవర్‌లాల్‌వర్మ, బాబు, రాజు, సునీత పాల్గొన్నారు.
మోండా డివిజన్‌లో
మోండా డివిజన్‌లో డిఆర్‌ఎస్ అభ్యర్ధి ఆకుల రూప రెజిమెంటల్‌బజార్‌లో ఇంటింటి ప్రచారం నిర్వహించారు. డివిజన్ ఇన్‌చార్జ్ జి.నగేష్, నాగేందర్, అమర్, వెంకటేష్, శ్రీ్ధర్ పాల్గొన్నారు. డివిజన్‌లో కాంగ్రెస్ నేతలు ముత్యాలు తదితరులు ఆ పార్టీకి రాజీనామా చేసి రూప, నగేష్ సమక్షంలో టిఆర్‌ఎస్‌లో చేరారు.