జాతీయ వార్తలు

పాక్‌లో నలభై వేల మంది మిలిటెంట్లు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ: పాకిస్థాన్‌లో ఇప్పటికీ నలభై వేల మంది మిలిటెంట్లు వరకు ఉండవచ్చని ఆ దేశ ప్రధాని ఇమ్రాన్‌ఖాన్ వెల్లడించారు. అమెరికా ప‌ర్య‌ట‌న‌లో ఉన్న ఆయ‌న‌.. యునైటెడ్ స్టేట్స్ ఇన్స్‌టిట్యూట్ ఆఫ్ పీస్‌లో జ‌రిగిన స‌మావేశంలో మాట్లాడుతూ తీవ్ర‌వాదులంతా ఆఫ్ఘ‌నిస్తాన్ లేదా క‌శ్మీర్‌లో శిక్ష‌ణ పొంది ఉంటార‌ని ఇమ్రాన్ తెలిపారు. పాకిస్థాన్ తెహ్రీక్ ఇన్సాఫ్ పార్టీ అధికారంలోకి రాక‌ముందు.. దేశంలో ఉన్న తీవ్ర‌వాదుల‌ను ఏరివేసేందుకు గ‌త ప్ర‌భుత్వాలు రాజ‌కీయ నిర్ణ‌యాలు తీసుకోలేక‌పోయాయ‌న్నారు. రాజ‌కీయ సంక‌ల్పం లేక‌పోవ‌డం వ‌ల్లే మిలిటెంట్లు రాజ్య‌మేలుతున్నార‌ని, దేశ స‌రిహ‌ద్దుల వ‌ద్ద సుమారు 40 మిలిటెంటు గ్రూపులు ఆప‌రేట్ చేస్తున్నాయ‌న్నారు.