క్రీడాభూమి

అద్వానీ ఖాతాలో మరో ప్రపంచ టైటిల్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హర్గడా, నవంబర్ 22: భారత క్యూయిస్టు పంకజ్ అద్వానీ ఖాతాలో మరో ప్రపంచ టైటిల్ చేరింది. ఇక్కడ జరిగిన ఐబిఎస్‌ఎఫ్ ప్రపంచ స్నూకర్ చాంపియన్‌షిప్‌లో అతను చైనాకు చెందిన జువా జింటాంగ్‌ను ఢీకొని 8-6 ఫ్రేమ్స్ (117-6, 75-16, 29-68, 63-23, 87-01, 16-72, 110-13, 113-01, 52-65, 13-84, 77-36, 14-126, 26-82, 116-24) తేడాతో విజయం సాధించాడు. అద్వానీకి కెరీర్‌లో ఇది 15వ ప్రపంచ టైటిల్. స్నూకర్స్‌లో ఐదవది. మిగతా పది ప్రపంచ టైటిళ్లు అతనికి బిలియర్డ్స్ విభాగంలో లభించాయి. 2003 తర్వాత అద్వానీ 15రెడ్ విభాగంలో ప్రపంచ చాంపియన్‌షిప్‌ను కైవసం చేసుకోవడం ఇదే మొదటిసారి. ఈఏడాది అతను 6రెడ్, 15 రెడ్ ఈవెంట్స్‌లో ప్రపంచ చాంపియన్‌షిప్‌ను గెల్చుకొని కొత్త చరిత్రకు శ్రీకారం చుట్టాడు.