జాతీయ వార్తలు

జూలై 18 నుంచి పార్లమెంటు వర్షాకాల సమావేశాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

దిల్లీ: వచ్చే నెల 18 నుంచి ఆగస్టు 12 వరకూ పార్లమెంటు సమావేశాలను నిర్వహించాలని పార్లమెంటరీ వ్యవహారాల మంత్రివర్గ ఉపసంఘం నిర్ణయించింది. రాబోయే సమావేశంలో జిఎస్‌టి బిల్లు పార్లమెంటు ఆమోదం పొందుతుందన్న ఆశాభావాన్ని కేంద్ర పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి వెంకయ్యనాయుడు బుధవారం వ్యక్తం చేశారు. ‘నీట్’ సహా పెండింగ్‌లో ఉన్న మూడు ఆర్డినెన్స్‌లను సమావేశాల్లో ఆమోదించాల్సి ఉందన్నారు. ప్రస్తుతం రాజ్యసభలో 45, లోక్‌సభలో 25 బిల్లులు పెండింగ్‌లో ఉన్నాయన్నారు. బిల్లుల ఆమోదానికి ముందుగానే విపక్షాలతో సమావేశం జరుపుతామన్నారు. పార్లమెంటులో విపక్షాలు ఏ అంశాన్ని లేవనెత్తినా సమాధానం చెప్పేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు.