హైదరాబాద్

ఆర్మీ రోడ్లపై ప్రవేశానికి అనుమతితో ప్రజల హర్షం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అల్వాల్, నవంబర్ 29: కంటోనె్మంట్‌లోని ఆర్మీ రోడ్లపై ప్రవేశానికి అనుమతి లభించడంతో ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. హైకోర్టు ఆదేశాలతో డిసెంబర్ ఒకటి నుండి ఉదయం, సాయంత్రం సమయం ప్రకారం రోడ్డులో ప్రయాణానికి అనుమతిస్తారు. ఆర్మీలోని రెండు ప్రధాన రోడ్లకు బదులుగా ప్రత్యాన్మయంగా మరో రోడ్లు సూచించాలని కోర్టు ఆదేశించారు. మిలటరీ అధికారులు భద్రత దృష్ట్య రోడ్లు మూసి వేయాలని అభ్యర్థిస్తున్నారు. మిలటరీ అధికారులు 2012 నుండి కౌకూర్ నుండి రోడ్లు మూసివేత కార్యక్రమాన్ని ప్రారంభించారు. కూకూర్ తర్వాత తిరుమలగిరి గాంధీనగర్‌లో రోడ్లు మూసి వేశారు. నందమూరినర్‌లో సర్వే పేరు మీద ప్రస్తుతం ఉన్న ఇళ్లను సగం వరకు కూల్చివేస్తామని హెచ్చరించారు. గత సంవత్సరం నుండి కంటోనె్మంట్ మీదుగా మల్కాజిగిరి, సపిల్‌గుడ, ఆనంద్‌బాగ్, వౌలాలి, ఇసిఐఎల్ వరకు, సికింద్రాబాద్ ఎఒసి కిరికి గెట్ నుండి సఫిల్‌గుడ వరకు వెళ్లే దారి కాగా ఈస్ట్‌మారెడ్‌పల్లి నుంచి గౌరురోడ్డు రామకృష్ణాపురం, నేరెడ్‌మెట్, డిఫెన్స్ కాలనీ వరకు ఉన్న రోడ్డును మూసివేస్తామని మిలటరీ అధికారులు ఆదేశించటంతో ప్రజలు ఆందోళన చెందారు. కంటోనె్మంట్, మల్కాజిగిరి ఎమ్మెల్యేలు సాయన్న, చింతల కనకారెడ్డి, మల్కాజిగిరి ఎంపి మల్లారెడ్డితో ఒత్తిడి పెంచారు. రోడ్లు యథావిధిగా కొనసాగించాలని ప్రయత్నాలు ముమ్మరం చేశారు. దీతో నవంబర్ 30 వరకు గడువు ఇచ్చారు. గడువు ముగియటంతో ముఖ్యమంత్రి కల్వకంట్ల చంద్రశేఖర్ రావు స్వయంగా జోక్యం చేసుకొని కేంద్ర రక్షణ శాఖ మంత్రి మనోహర్ పారికర్‌కు లేఖ రాసారు. కేంద్ర ప్రభుత్వం స్పందించి 2016 మే 31 వరకు గడువు పొడిగిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.