జాతీయ వార్తలు

స్వల్పంగా తగ్గిన పెట్రోలు, డీజిల్ ధరలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, డిసెంబర్ 31: కొత్త సంవత్సరంలో వాహనదారులకు ఓ శుభవార్త. పెట్రోలు, డీజిలు ధరలు స్వల్పంగా తగ్గాయి. పెట్రోలు ధర లీటరుకు 63 పైసలు, డీజిలు ధర లీటరుకు రూపాయి ఆరు పైసలు తగ్గాయి. తగ్గిన ధరలు గురువారం అర్ధరాత్రినుంచి అమలులోకి వచ్చాయి. అంతర్జాతీయ మార్కెట్లో పెట్రోలియం ఉత్పత్తి ధరలు, డాలరుతో రూపాయి మారకం విలువల ఆధారంగా పెట్రోలు, డీజిలు ధరలను తగ్గించడం జరిగిందని దేశంలో అతిపెద్ద రిటైల్ పెట్రోలియం విక్రయ కంపెనీ అయిన ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ తెలిపింది. ఈ నెలలో పెట్రోలు, డీజిలు ధరలు తగ్గడం ఇది రెండోసారి. ఈ నెల 15న పెట్రోలు ధర లీటరుకు 50 పైసలు, డీజిలు ధర లీటరుకు 46 పైసలు తగ్గడం తెలిసిందే.