ఖమ్మం

అక్రమాలకు పాల్పడ్డ అధికార పార్టీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

* ఖమ్మం ఎంపి పొంగులేటి ఆరోపణ
ఖమ్మం, మార్చి 6: ఖమ్మం కార్పొరేషన్ ఎన్నికల్లో అధికార పార్టీ అక్రమాలకు పాల్పడిందని వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు, ఖమ్మం ఎంపి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఆరోపించారు. ఆదివారం జరిగిన ఖమ్మం కార్పొరేషన్ ఎన్నికలలో భాగంగా ఆయన నగరంలోని పోలింగ్ బూత్‌లను పరిశీలించారు. ఈ సందర్భంగా 26వ డివిజన్‌లో దొంగ ఓట్లు వేస్తున్నవారిని వైసిపి అభ్యర్థి పట్టుకోగా వారిని పోలీసులు వదిలివేయటంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. 26వ డివిజన్‌లో దొంగ ఓట్లు పోలౌవుతున్నాయని తెలియటంతో ఆయన ఆ పోలింగ్ బూత్ వద్ద కూర్చొని పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కార్పొరేషన్ ఎన్నికల్లో నెగ్గేందుకు అధికార పార్టీ కుట్రలు చేసిందని ఆరోపించారు. ఎలాగైనా గెలుపొందాలనే ఉద్దేశంతోనే పోలీసు యంత్రాంగాన్ని ఉపయోగించుకొని తమ పార్టీ అభ్యర్ధులను అదుపులోకి తీసుకొని అక్రమ కేసులను బనాయించే ప్రయత్నం చేశారన్నారు. జిల్లాలో తమ పార్టీకి ఉన్న ప్రజాదరణను చూసి తట్టుకోలేక ఎన్నికల్లో ఓడిపోతామనే భయంతో ఇటువంటి కుట్రలకు పూనుకుందని దుయ్యబట్టారు. అధికార పార్టీ అభ్యర్ధులకు పోలీసులు సైతం సహకరిస్తున్నారనే ఆరోపణలు వెల్లువెత్తాయన్నారు. ఈ ఎన్నికల్లో అధికార పార్టీకి ప్రజలు తగిన గుణపాఠం చెబుతారని, తమ అభ్యర్ధులపై కుట్రలకు పాల్పడితే వారికి ప్రజాకోర్టులో శిక్ష తప్పదని హెచ్చరించారు.