జాతీయ వార్తలు

నేడు విహెచ్ వౌనదీక్ష

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బిసిల రిజర్వేషన్లు సరిగా అమలుచేయనందుకు నిరసన
న్యూఢిల్లీ, మార్చి 13: వెనుకబడిన కులాలకు కేటాయించిన 27 శాతం రిజర్వేషన్లు అమలు చేయనందుకు నిరసనగా సోమవారం పార్లమెంట్ ముందున్న మహాత్మాగాంధీ విగ్రహాం వద్ద వౌన ప్రదర్శన దీక్ష చేపట్టనున్నట్లు రాజ్యసభ సభ్యుడు వి. హనుమంతరావు చెప్పారు. బిసిలకు 9 శాతానికి మించి రిజర్వేషన్లు అమలుకావడం లేదని, బిసి ప్రధాని మంత్రి అయిన నరేంద్ర మోదీ బిసిల సమస్యలు పరిష్కరించడం లేదని ఆయన వాపోయారు. క్రీమీలేయర్ విధానాన్ని అమలుచేయడం వల్లనే బిసిల రిజర్వేషన్లకు ఇబ్బందులు వస్తున్నాయని పేర్కొన్నారు. ఓటుకు నోటు వ్యవహారం, ఎమ్మెల్యేలను కోనుగోలు చేయటం ఇవన్నీ రాజకీయ దిగజారుడుతనానికి నిదర్శనమని హనుమంరావు పేర్కొన్నారు. కోట్లాది రూపాయల మేర బ్యాంకులను మోసం చేసిన కేంద్ర మంత్రి సుజనా చౌదరి, మాజీ ఎంపీ లగడపాటి రాజగోపాల్‌పై సిబిఐ విచారణ జరిపించాలని విహెచ్ డిమాండ్ చేశారు.