హైదరాబాద్

పోలీసుల అదుపులో నకిలీ వైద్యులు..?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పాతబస్తీలోని ప్రైవేటు ఆసుపత్రుల్లో సోదాలుఅర్హతలేని 110మంది వైద్యుల అరెస్టు

ధ్రువ పత్రాలు లేని ఆసుపత్రులు సీజ్ సౌత్‌జోన్ డిసిపి వి సత్యనారాయణ వెల్లడి

హైదరాబాద్, నవంబర్ 29: జంటనగరాల్లో వీధికో క్లినిక్, కాలనీకో నర్సింగ్ హోం, మున్సిపల్ డివిజన్‌కో కార్పొరేట్ ఆసుపత్రి అర్హతలేని వైద్యులతో నడుస్తున్నాయి. వైద్యం పేరుతో ప్రజలను మోసం చేస్తున్న ఆసుపత్రులపై పోలీసులు శనివారం రాత్రి సోదాలు చేపట్టారు. దీంతో కొందరు నకిలీ వైద్యుల గుట్టు రట్టయింది. ఇటీవల ఫలక్‌నుమా పోలీసు స్టేషన్ పరిధిలోని శంషీర్‌గంజ్‌లో ఓ మహమ్మద్ ఇస్మాల్ హుస్సేన్ అలియాస్ సాజిద్ అనే వైద్యుడు ఖాజామోహినొద్దిన్ అనే రోగికి చేసిన వైద్యం వికటించి మృతి చెందగా, మృతదేహాన్ని ఖననం చేసే తరుణంలో పోలీసులు అదుపులోకి తీసుకొని విచారించారు. సదరు వైద్యుడికి ఎలాంటి అర్హతలేదని తేలింది. ఈ నేపథ్యంలో ఆసుపత్రులపై దృష్టి సారించిన సౌత్‌జోన్ పోలీసులు పాతబస్తీలోని పలు ప్రైవేటు ఆసుపత్రుల్లో సోదాలు నిర్వహించారు. దక్షిణ మండలం పరిధిలోని ఫలక్‌నుమా, చార్మినార్, మీర్‌చౌక్, సంతోష్‌నగర్‌తో పాటు పలుప్రాంతాల్లో అర్హతలేని వైద్యులచే అనుమతిలేని ఆసుపత్రులు నిర్వహిస్తున్న 110మంది వైద్యులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఆయుర్వేదిక్, యునాని, ఆర్‌ఎంపి, పిఎంపి, వైద్యులతోపాటు ఎలాంటి ధ్రువీకరణ పత్రాలు లేని వైద్యులపై కేసు నమోదు చేశారు. సౌత్ జోన్ డిసిపి వి సత్యనారాయణ నేతృత్వంలోని బృందం ఆసుపత్రుల్లో సోదాలు నిర్వహిస్తుంది. ఈ సోదాలు ఇంకా కొనసాగుతాయని డిసిపి సత్యనారాయణ పేర్కొన్నారు. ఆదివారం ఆయన విలేఖరులతో మాట్లాడుతూ ప్రజాభద్రత, నేరాల అదుపులో భాగంగా చేపట్టిన కార్డన్ సెర్చ్, సెర్చ్ ఆపరేషన్‌లో రిజిస్టర్డ్ మెడికల్ ప్రాక్టిషనర్స్, ప్రైవేటు మెడికల్ ప్రాక్టిషనర్స్‌లతోపాటు ఆయుర్వేదిక్, యునాని వైద్యులు కార్పొరేట్ స్థాయిలో క్లినిక్‌లు నిర్వహిస్తున్నారని, అర్హతలేని వైద్యులు రోగుల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రేవేటు ఆసుపత్రుల నిర్వహణ ఇలావుంటే మెడికల్ షాపుల్లో కేవలం ఏడవ తరగతి చదివిన విద్యార్థులే పనిచేస్తున్నారని, వారికి వైద్యుల ప్రిస్క్రిప్షన్‌లపై ఎలాంటి అవగాహన ఉండదని, మందుల ఎక్స్‌పైరీ తేదీలు కూడా గుర్తించని వారితో వ్యాపారం సాగిస్తున్నారన్నారు. అదేవిధంగా ఒక్కో ప్రాంతంలో వైద్యుడి పేరు ఒకరిది ఉంటే..మరొకరు వైద్యం చేస్తున్నారని, పాతనగరంలో ప్రధానంగా డెంటల్ క్లినిక్‌లు ఎక్కువ శాతం నిర్వహిస్తున్నారని డిసిపి సత్యనారాయణ వివరించారు. తెలంగాణ మెడికల్ కౌన్సిల్ ఆమోదిత ఆసుపత్రులు, వైద్యుల సర్ట్ఫికెట్లను కూడా తనిఖీ చేస్తున్నామని, నకిలీ వైద్యులపై నాన్ బెయిలేబుల్ కేసు నమోదు చేసేందుకు కూడా వెనుకాడబోమని డిసిపి సత్యనారాయణ హెచ్చరించారు.