మెదక్

రోడ్డు ప్రమాదంలో ముగ్గురు దుర్మరణం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నర్సాపూర్,జనవరి 21: నియోజకవర్గ కేంద్రమైన నర్సాపూర్‌లో జరిగిన రోడ్డు ప్రమాదంలో ముగ్గురు అక్కడికక్కడే దుర్మరణం పాలైన సంఘటన గురువారంనాడు జరిగింది. ఇందుకు సంబంధించిన వివరాలిలా ఉన్నాయి. నర్సాపూర్‌లోని అంబేద్కర్ చౌరస్తా వద్ద సంగారెడ్డి వైపు నుంచి అతి వేగంగా వస్తున్న బోగ్గు లారీ నెంబర్ ఎపి 16టి.వైని మెదక్ వైపు నుంచి అతివేగంగా వస్తున్న ఆటో నెంబర్ టిఎస్ 15యూఏ 4520 గలదానిని ఢీ కొట్టడంతో ఆటో నుజ్జు నుజ్జు అయ్యి అందులో ప్రయాణిస్తున్న నర్సాపూర్ మండలం పెద్ధచింతకుంట గ్రామానికి చెందిన ఐదు నెలల గర్భిణి అశ్వీని (22), కౌడిపల్లి మండలంలోని రాజిపేటకు చెందిన మాసాని ప్రభు(23), గురాటిలా వినయ్ (19) అక్కడికక్కడే మృతి చెందారు.
కాగా తీవ్రంగా గాయపడ్డ పెద్దచింతకుంటకు చెందిన వీరమణిని చికిత్స నిమిత్తం హైదరాబాద్‌లోని గాంధీ ఆసుపత్రికి తరలించారు. ఆటో డ్రైవర్ అంతటి రాజు సైతం స్వల్ప గాయాలతో బయట పడ్డట్లు పోలీసులు తెలిపారు. నర్సాపూర్ అంబేద్కర్ చౌరస్తాలో సంగారెడ్డి వైపు నుంచి లారీ వస్తున్నట్లు గమణించని ఆటో డ్రైవర్ ఒక్కసారిగా అయోమయానికి గురికావడం వల్లనే ప్రమాదం జరిగిందని ప్రత్యక్షసాక్షులు తెలిపారు. రోడ్డు ప్రమాదంలో ముగ్గురు చనిపోయిన సంఘటన పట్టణంలో తెలియడంతో ఒక్కసారిగా స్థానిక ప్రభుత్వాసుపత్రికి ప్రజలు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. మృతుల కుటుంబ సభ్యులతో పాటు రాజీపేట, చింతకుంట గ్రామాలకు చెందిన ప్రజలు తరలిరావడంతో ఆసుపత్రి ఆవరణ కిక్కిరిసిపోయింది. మృతుల కుటుంబ సభ్యుల అర్తనాదాలతో ఆసుపత్రి దద్ధరిళ్లింది. సంఘటన స్థలాన్ని సిఐ తిరుపతిరాజు, ఎస్‌ఐ గోపినాథ్ సందర్శించి లారీని స్వాధీనం చేసుకొని కేసు నమోదు చేసినట్లు తెలిపారు.
మృతుల కుటుంబాలను
పరామర్శించిన ఎమ్మెల్యే
నర్సాపూర్‌లో గురువారంనాడు జరిగిన ప్రమాదంలో మృతి చెందిన వారి కుటుంబ సభ్యులను స్థానిక ఎమ్మెల్యే మదన్‌రెడ్డి ఆసుపత్రి ఆవరణలో పరమార్శించారు. ఈసందర్భంగా ప్రమాదం జరిగిన తీరును అడిగి తెలుసుకున్నారు. ఆయన వెంట ఎంపిపి అధ్యక్షుడు శ్రీనివాస్‌గౌడ్, నాయకులు అశోక్‌గౌడ్, శేకర్, రామాగౌడ్ తదితరులున్నారు.
రాజీపేటలో విషాదఛాయలు
కౌడిపల్లి మండలంలోని రాజీపేటకు చెందిన హత్నూర ఐటిఐ విద్యార్థి వినయ్ (19), అదే గ్రామానికి చెందిన ప్రభు(22) హైదరాబాద్‌లోని ఓ బట్టల షాపులో పని చేస్తున్నారు. కాగా ప్రతి రోజు లాగానే పని కోసం వెళుతున్న క్రమంలో నర్సాపూర్ చౌరస్తాలో జరిగిన ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయారు. దాంతో ఒక్కసారిగా గ్రామాంలో విషాధచాయలు అలుముకున్నాయి. గ్రామస్థులు పెద్ధ సంఖ్యలో నర్సాపూర్ చేరుకొని మృతుల కుటుంబ సభ్యులను ఓదార్చారు.