జాతీయ వార్తలు

రాఫెల్ ఒప్పందం ఏ పద్ధతిలో జరిగింది ?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ: ఫ్రాన్స్‌తో జరిగిన రాఫెల్ యుద్ధ విమానాల కొనుగోలు ఏ పద్ధతిలో నిర్ణయం తీసుకున్నారో చెప్పాలని కోర్టు సుప్రీంకోర్టు కేంద్రాన్ని ఆదేశించింది. అయితే రాఫెల్ విమానాల ధరలు కానీ, వాటి సాంకేతిక అంశాలు తమకు అవసరం లేదని కోర్టు స్పష్టం చేసింది. అక్టోబర్ 29వ తేదీలోగా ఆ సమాచారాన్ని ఇవ్వాలని కోర్టు పేర్కొన్నది. రాఫెల్ అంశంపై మళ్లీ అక్టోబర్ 31వ తేదీన సుప్రీం విచారించనున్నది. రాఫెల్ కొనుగోలుపై వస్తున్న ఆరోపణలను ఈ కేసులో పరిగణలోకి తీసుకోవడం లేదని ధర్మాసనం తెలిపింది. బెంచ్‌లో జస్టిస్ రంజన్ గగోయ్‌తో పాటు జస్టిస్ ఎస్‌కే కౌల్, జస్టిస్ కేఎం జోసెఫ్‌లు ఉన్నారు.