జాతీయ వార్తలు

చైనాను శత్రువుగా చూడరాదు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఎయిర్ చీఫ్ మార్షల్ ఆరూప్ రహా
హసిమరా (పశ్చిమ బెంగాల్), నవంబర్ 28: చైనాను భారత్ విరోధిగా చూడరాదని వైమానికదళ ప్రధానాధికారి ఆరూప్ రహా విజ్ఞప్తి చేశారు. ఇరు దేశాలు పరిపక్వతతో కూడిన రాజనీతిజ్ఞతను ప్రదర్శించాల్సిన అవసరం ఉందని ఆయన ఉద్ఘాటించారు. పశ్చిమ బెంగాల్‌లోని అలీపూర్‌దువార్ జిల్లాలో శనివారం ఆయన విలేఖర్లతో మాట్లాడుతూ, ఒకే ప్రాంతంలో ఉన్న భారత్, చైనాలకు ఉమ్మడి ప్రయోజనాలు ఎన్నో ఉన్నాయని, కనుక ఇరు దేశాలు పరస్పరం విరోధులుగా చూసుకోరాదని అన్నారు. చైనా నుంచి భారత్‌కు ముప్పు ఉందా? అన్న ప్రశ్నకు ఆయన సమాధానమిస్తూ, యుద్ధంలో తలపడిన భారత్, చైనా సరిహద్దు సమస్యలను పరిష్కరించుకోల్సి ఉందని, ప్రాంతీయ అభివృద్ధి కోసం సహకారాన్ని, సమన్వయాన్ని పెంపొందించుకునేందుకు రాజనీతిజ్ఞతతో వ్యవహరించేందుకు ఇదే సరైన తరుణమని భావిస్తున్నానని తెలిపారు.