జాతీయ వార్తలు

ఓఆర్‌ఓపిపై మోదీ అబద్ధాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, నవంబర్ 4: పదవీ విరమణ చేసిన రక్షణశాఖ ఉద్యోగులకు ఓఆర్‌ఓపి పథకం అమలు విషయంలో ప్రధాని నరేంద్ర మోదీ అబద్ధాలు ఆడుతున్నారని కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్‌గాంధీ ధ్వజమెత్తారు. కేంద్ర ప్రభుత్వం ఏవో సాకులు చెబుతూ దాటవేత ధోరణి అవలంబిస్తోందని శుక్రవారం ఆయన ఆరోపించారు.
ఒన్ ర్యాంక్ ఒన్ పెన్షన్ పథకం సాయుధ దళాల ఉద్యోగుల హక్కు అని ఆయన స్పష్టం చేశారు. మాజీ సైనికుడు రామ్‌కిషన్ గ్రేవాల్ ఆత్మహత్యపై నిరసనకు దిగిన కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్‌ను రెండు రోజుల్లో మూడు సార్లు పోలీసులు అరెస్టుచేశారు. ఓఆర్‌ఓపి అమలు చేయనందుకే గ్రేవాల్ ఆత్మహత్యకు ఒడిగట్టారని ఆయన అన్నారు. కాగా అరెస్టులకు తాను భయపడేదిలేదని, సమస్య పరిష్కారమే తనకు ముఖ్యమని ఆయన అన్నారు. అధికారం కోసం ఎన్నికల్లో హామీలు గుప్పించిన మోదీ ఆనకు వాటిని విస్మరించారని రాహుల్ విమర్శించారు. 1.10 లక్షల కోట్లు మాఫీ చేసిన పారిశ్రామికవేత్తలకు మేలు చేశారని ఆయన దుయ్యబట్టారు. రైతులు, సైనికులకు ఇవ్వడానికి మాత్రం ప్రభుత్వం వద్ద సొమ్ములు లేవని కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు ఎద్దేవా చేశారు. ప్రకటనలు చేయడమే తప్ప సైనికులంటే మోదీ ప్రభుత్వానికి గౌరవం లేదని, ఓఆర్‌ఓపి కోసం 509 రోజులుగా జంతర్‌మంతర్ వద్ద నిరసన తెలుపుతున్నా పట్టించుకోకపోవడమే దానికి ఉదాహరణ అని రాహుల్ పేర్కొన్నారు. ఏఐసిసి ప్రధాన కార్యాయలం వద్ద 70 మంది మాజీ సైనికులలో రాహుల్ సమావేశమయ్యారు. దేశం కోసం త్యాగాలు చేస్తున్న సైనికులకు న్యాయం చేయాలన్న ధ్యాస కేంద్రానికి లేదని అన్నారు.
రాహుల్ అరెస్టు అక్రమం
ఆత్మహత్యకు పాల్పడ్డ మాజీ సైనికుడిని పరామర్శించేందుకు వెళ్లిన కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్‌గాంధీని ఏ చట్టం కింద అరెస్టు చేశారని ఏఐసిసి ప్రధాన కార్యదర్శి దిగ్విజయ్ సింగ్ నిలదీశారు. రాహుల్ అరెస్టు అన్యాయం, అక్రమం అంటూ ఆయన నిప్పులు చెరిగారు. ఏ చట్టం కింద అరెస్టుచేశారు, ఎఫ్‌ఐఆర్‌ను నమోదుచేశారా?అని ఆయన ప్రశ్నించారు. రెండు రోజుల్లో మూడు సార్లు రాహుల్‌ను అదుపులోకి తీసుకున్నారని, ఏ చట్టం కింద ఆయనను అరెస్టు చేసిందీ ఢిల్లీ పోలీసులకు తెలిస్తే చెప్పాలని దిగ్విజయ్ డిమాండ్ చేశారు. మాజీ సైనికుడు మృతికి సంతాపం తెలుపుతూ శాంతియుతంగా కొవ్వొత్తుల ప్రదర్శన చేయడం నేరమా? అని ఆయన అడిగారు. ఓ జాతీయ పార్టీ ఉపాధ్యక్షుడు, ఎంపీ పట్లే ఢిల్లీ పోలీసులు ఇలా ప్రవర్తించారంటే సామాన్యుడి పరిస్థితి ఏమిటని ఆయన ప్రశ్నించారు.
చిత్రం.. ఢిల్లీలో మీడియాను ఉద్దేశించి మాట్లాడుతున్న కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్‌గాంధీ