జాతీయ వార్తలు

బీజేపీకి గుణపాఠం:రాహుల్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కర్నాటక:అధికారం కోసం బీజేపీ సభ్యులు హద్దుమీరి ప్రవర్తిస్తున్నారని కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు రాహుల్ గాంధీ విమర్శించారు. కర్ణాటకలో యడ్యూరప్ప రాజీనామా తరువాత ఢిల్లీలో రాహుల్ విలేకర్లతో మాట్లాడారు. మణిపూర్, గోవాలలో బీజేపీ ప్రజా తీర్పును గౌరవించలేదని అన్నారు. జాతీయ గీతం ఆలపిస్తుంటేనే బీజేపీ సభ్యులు సభ నుంచి వెళ్లిపోవటం వల్ల వారికి జాతీయగీతం పట్ల ఉన్న గౌరవం ఇదేనా అని ప్రశ్నించారు. మోదీ అనుమతితోనే ఎమ్మెల్యేలను కొనుగోలు చేయాలని ప్రయత్నించారు. ఆర్‌ఎస్‌ఎస్, బీజేపీ కర్నాటక ఫలితాలు ఓ మంచి గుణపాఠం అని అన్నారు. మోదీ, అమిత్‌షా తాము చట్టానికి అతీతులం అని అనుకుంటున్నారని ఆయన విమర్శించారు. ఈ సందర్భంగా దేవెగౌడకు రాహుల్ అభినందనలు తెలియజేశారు.